Begin typing your search above and press return to search.

కశ్మీర్‌ లేకుండా భారత్ మ్యాప్‌.. ఎమ్మెల్యేపై కేసు !

By:  Tupaki Desk   |   17 Aug 2020 11:45 AM GMT
కశ్మీర్‌ లేకుండా భారత్ మ్యాప్‌.. ఎమ్మెల్యేపై కేసు !
X
జమ్మూకాశ్మీర్ విషయం లో గత కొన్నేళ్లుగా భారత్ , పాక్ మధ్య వివాదం నడుస్తుంది. భారత్ లో భాగమైన కాశ్మీర్ నుండి పాకిస్థాన్ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది..ఇప్పటికి చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాల్లో పాక్ కి బుద్ది చెప్తూ ఎంతోమంది భారత జవాన్లు దేశం కోసం అమరులైయ్యారు. తాజాగా జమ్ముకశ్మీర్‌ మ్యాప్‌ విషయంలో పెద్ద వివాదమే రాజుకుంది. కేరళకు చెందిన అరూర్‌ ఎమ్మెల్యే శానిమోల్‌ ఒస్మాన్‌ జమ్ముకశ్మీర్ ‌లేని భారతదేశం మ్యాప్‌ ను ఫేస్ ‌బుక్ ‌లో పోస్ట్‌ చేయటంపై వివాదం రాజుకుంది

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..కేరళకు చెందిన అరూర్‌ ఎమ్మెల్యే శానిమోల్‌ ఒస్మాన్‌ జమ్ముకశ్మీర్‌లేని భారతదేశం మ్యాప్‌ను ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ చేయటంతో వివాదం రాజుకుంది. ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మ్యాప్‌ను పోస్ట్‌ చేశారు. దీనిపై సీపీఎం నేతలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, త్వరలోనే చర్యలు చేపడుతామని జిల్లా ఎస్పీ పీఎస్‌ సబు తెలిపారు. కాగా, ఈ వ్యవహారంపై శానిమోల్‌ ఒస్మాన్‌ ఫేస్ ‌బుక్‌ అకౌంట్‌ నిర్వాహకులు క్షమాపణ చెప్పారు. పొరపాటున కశ్మీర్‌ లేని మ్యాప్‌ ను పోస్ట్‌ చేసినట్టు వివరణ ఇచ్చారు.