Begin typing your search above and press return to search.

వినోదంలో వేలెట్టటం ఎందుకు దేవేంద్ర?

By:  Tupaki Desk   |   7 April 2015 5:20 PM GMT
వినోదంలో వేలెట్టటం ఎందుకు దేవేంద్ర?
X
మహారాష్ట్ర సర్కారు చిత్రమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివకూ తన వ్యవహారశైలితో అందరిని ఆకర్షిస్తోన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తాజాగా తీసుకున్న నిర్ణయం బాలీవుడ్‌ను విస్తుపోయేలా చేసింది.

ఇకపై మహారాష్ట్రలోని మల్టీఫ్లెక్సుల్లో ప్రైమ్‌ టైం అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ మరాఠీ సినిమాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో బాలీవుడ్‌కు షాక్‌ తగిలినంత పనైంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని ఏ ఒక్కరూ కోరలేదని.. అయినా.. ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏమిటంటూ పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు విమర్శిస్తున్నారు.

ఆవు మాంసంపై నిషేధం విధించిన తర్వాతి రోజే.. తీసుకున్న మరాఠా సినిమాల ప్రదర్శన తప్పనిసరి అన్న నిర్ణయం మల్టీఫ్లెక్సుల్ని దెబ్బ తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. సినిమా హాళ్లలో భారత చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కేపై రూపొందించిన లఘు చిత్రాన్ని తప్పనిసరిగా అన్ని థియేటర్లలో ప్రదర్శించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. జనాలు డబ్బులు పెట్టి కొనుక్కునే వినోదంలోనూ ఆంక్షల రూపంలో వేలెట్టటంలో ఏం న్యాయం ఉందంటూ మహారాష్ట్ర సీఎంను పలువురు ప్రశ్నిస్తున్నారు.