Begin typing your search above and press return to search.
మోడీపై.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. సంచలన కామెంట్లు
By: Tupaki Desk | 25 July 2022 11:30 AM GMTదేశ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాల కూటమి ఉమ్మడి అభ్యర్థి.. మార్గరెట్ ఆళ్వా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తినాలనుకున్నది తినలేమని.. చెప్పాలనుకున్నది చెప్పలేమని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఇంత దారుణమైన పరిస్థితిని తాను ఎప్పుడూ.. చూడలేదన్నా రు. తానుఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం చారిత్రక అవసరమని చెప్పిన ఆమె.. ఓడిపోతానని తనకు ముందుగానే తెలుసునన్నారు.
ప్రతిపక్ష పార్టీల్లో ఐక్యత కొరవడటంతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచే అవకాశం దాదాపుగా లేకపోయినా.. తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మార్గరెట్ ఆళ్వా స్పష్టం చేశారు. సంఖ్యా బలానికి సంబంధించిన అంకెలు ఎప్పుడైనా అటూ ఇటూ కావొచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆళ్వా తాజాగా జాతీయ మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉండాలన్న నిర్ణయంపై పునరాలోచించేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీకి ఇంకా సమయం ఉందని చెప్పారు. దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ.. 'కావల్సినది తినలేం, చెప్పాలనుకున్నది చెప్పలేం, కలవాలనుకున్నవారిని కలవలేం. ఇదంతా ఏంటి? ఒకే ఒక్క వ్యక్తి' అని పరోక్షంగా నరేంద్ర మోడీపై ఆమె విరుచుకుపడ్డారు.
దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉండాలన్న నిర్ణయంపై పునరాలోచించేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సమయం ఉందని అభిప్రాయపడ్డారు. తాను ఓడిపోయినా.. నైతికంగా గెలుస్తానని చెప్పారు.రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం కొందరి బల ప్రయోగమే కారణమని వ్యాఖ్యానించారు.
`` ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి లెక్కలేదు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఎక్కడ చూసినా అంగబలం, అర్థబలంతో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు.`` అని ఆళ్వా వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. ఆళ్వా ఆగ్రహం అంతా కూడా.. నరేంద్ర మోడీ.. బీజేపీపై స్పష్టంగా కనిపించడం గమనార్హం.