Begin typing your search above and press return to search.
హత్యకు హత్యే శిక్ష - ఇప్పటికీ నమ్ముతున్న అమెరికా!
By: Tupaki Desk | 21 Jun 2019 3:13 PM GMTఉత్తమ జీవన ప్రమాణాలు అని చెప్పుకునే అమెరికా - నేరస్థులకు కూడా హక్కులు ఉంటాయనే చెప్పుకునే అగ్రరాజ్యం మనసు చాాలా కఠినమైనదని అమెరికా గురించి వెలువడిన ఓ తాజా నివేదిక ద్వారా అర్థమవుతుంది. నేరాల అదుపునకు ఇప్పటికీ మరణ శిక్షను బలంగా వాడుకుంటోంది అమెరికా. తాజాగా నివేదికలో ఆ విషయం బయటకు వచ్చింది. మరణ శిక్ష పడిన ఓ నేరస్థుడికి అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గురువారం మరణశిక్ష అమలు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ‘అమెరికా మరణశిక్ష చట్టం-1976’ ను పునరుద్ధరించిన అనంతరం విధించిన 1500వ మరణ శిక్ష ఇది. పాశ్చాత్య దేశాలలోనే కాదు - ఇండియాతో సహా ఇంత పెద్ద సంఖ్యలో ఏ దేశమూ మరణ శిక్షలు అమలు చేయడం లేదు.
ఈ గురువారం మరణ శిక్ష కు గురయిన మరియన్ విల్సన్ (42) పాతికే ళ్ల క్రితం 1996లో ఓ జైలు గార్డును హత్య చేశాడు. మరుసటి ఏడాదే విల్సన్ ను కోర్టు దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. సుదీర్ఘ జైలు శిక్ష అనంతరం గురువారం మరణ శిక్ష విధించారు. జాక్సన్ లోని జార్జియా డయాగ్నోస్టిక్ అండ్ క్లాసిఫికేషన్ ప్రిజన్ లో విల్సన్ కు మరణశిక్ష అమలు చేశారు. పెంటో బార్బిటల్ మందును అతని శరీరంలోకి ఎక్కించడం ద్వారా మరణ శిక్ష అమలు చేశారు.
ఇదిలా ఉండగా అమెరికాలో మరణశిక్షను పునరుద్ధరించాక 1977లో తొలి మరణశిక్ష అమలు చేశారు. అది కూడా ఓ హత్య కేసులో దోషికి మరణ శిక్ష వేశారు. తుపాకి కాల్పులతో అతనికి మరణ శిక్ష విధించారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం అత్యధిక మరణశిక్షలను అమలుచేసి రాష్ట్రంగా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 561 మందికి మరణశిక్ష విధించారు.