Begin typing your search above and press return to search.
జుకర్ బర్గ్... ప్రపంచ ఆరో ధనవంతుడు
By: Tupaki Desk | 28 Jan 2016 7:03 AM GMTప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఆయన ప్రపంచ సంపన్నుల్లో ఆరవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫేస్ బుక్ షేర్లు బుధవారం 12 శాతం వృద్ధి చెందడంతో ఒక్కరోజే జుకర్ బర్గ్ ఆస్తి 4.85 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో ఆయన సంపద 46.25 బిలియన్ డాలర్ల కు చేరింది. ప్రపంచంలోని 10 మంది సంపన్నుల్లో అత్యంత పిన్న వయస్కుడు జుకర్‌బర్గ్ కావడం విశేషం.
మరోవైపు బుధవారం ఫేస్ బుక్ షేర్లు అమాంతం పెరగడంతో ఆయన 46.25 బిలియన్ డాలర్ల ఆస్తిని చేరుకున్నారు. ఈ క్రమంలో ఒరాకిల్ ఛైర్మన్ లారీ ఎలిసన్ కన్నా జుకర్ సంపద 2.5 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఎలిన్ సంపద 43.6 బిలియన్ డాలర్లు. దీంతో ఒరాకిల్ ఛైర్మన్ ను వెనక్కు నెట్టి జుకర్ ఆరో స్థానాన్ని ఆక్రమించారు.
కాగా జుకర్ బర్గ్ కు ఇటీవల కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. పాప పుట్టిన తరువాత జుకర్ బర్గ్ కు మరింత కలిసొచ్చిందని అంటున్నారు. మొన్నమొన్నటి వరకు పితృత్వ సెలవులో ఉన్న జుకర్ ఇప్పుడిప్పుడే ఆఫీసుకు వెళ్తున్నారట. సుదీర్ఘ సెలవు తరువాత ఆయన ఆఫీసుకు వెళ్లడం.. షేర్లు విలువ పెరగడంతోవారెవ్వా జుకర్ అంటున్నారు ఫేస్ బుక్ ఉద్యోగులు.