Begin typing your search above and press return to search.

కొత్త బాంబ్ పేల్చిన ఫేస్ బుక్!

By:  Tupaki Desk   |   30 April 2018 12:39 PM GMT
కొత్త బాంబ్ పేల్చిన ఫేస్ బుక్!
X
ఇవాల్టి రోజున వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు త‌మ అకౌంట్ల‌ను తెరిచి.. త‌మ వివ‌రాల్ని పోస్ట్ చేస్తున్న ఫేస్ బుక్ కార‌ణంగా వ్య‌క్తిగ‌త డేటా భ‌ద్ర‌త‌కు సంబంధించిన కొత్త స‌మ‌స్య‌లు ఒక్కొక్క‌టిగా తెర మీద‌కు వ‌స్తున్న వైనం తెలిసిందే. ఈ మ‌ధ్య‌నే ఫేస్ బుక్ డేటాకు సంబంధించి కోట్లాది ఖాతాల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని చేజిక్కించుకున్న కేంబ్రిడ్జ్ అన‌లిటికా లీక్ వ్య‌వ‌హారాన్ని ప్ర‌పంచాన్ని.. ఫేస్ బుక్ ను ఎంత‌గా కుదిపివేసిందో తెలిసిందే.

కేంబ్రిడ్జ్ అన‌లిటికా చేసిన ప‌నికి ఫేస్ బుక్ అధినేత ప్ర‌శ్న‌ల బోనులో నిలుచొని నైతిక‌త‌కు సంబంధించి స‌మాధానాలు చెప్పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇదిలా ఉంటే.. డేటా భ‌ద్ర‌త‌కు తాము ఎన్నో చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఫేస్ బుక్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే.. స‌ద‌రు సంస్థ చెప్పినంత ఈజీగా విష‌యాలు ఉండ‌వ‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే ఫేస్ బుక్ త‌న తాజా నివేదిక‌లో బాంబులాంటి మాట‌ను బ‌య‌ట‌పెట్టింది.

డేటా లీక్ షాక్ నుంచి ఇంకా కోలుకోక‌ముందే.. తాజాగా జుక‌ర్ బ‌ర్గ్ మ‌రో బాంబును పేల్చారు. డేటా లీక్ కు సంబందించి మ‌రింత ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న అంచ‌నాను ఫేస్ బుక్ త‌న త్రైమాసిక రిపోర్టులో పేర్కొన‌టం గ‌మ‌నార్హం. అమెరికా సెక్యురిటీస్ అండ్ ఎక్చ్సేంజ్ క‌మిష‌న్ కు ఇచ్చిన త్రైమాసిక నివేదిక‌లో ఫ్యూచ‌ర్లో మ‌రింత డేటా లీక్ ల‌కు అవ‌కాశం ఉంద‌ని ఫేస్ బుక్ చెప్పుకుంది. కేంబ్రిడ్జ్ ఎన‌లిటికా గురించి ప్ర‌స్తావించ‌కుండానే.. డేటా లీక్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

థ‌ర్డ్ పార్టీల తీరు కార‌ణంగా వినియోగ‌దారుల డేటా లీక్ ఘ‌ట‌న‌లు మ‌రిన్ని వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌టంతో పాటు.. త‌మ సంస్థ నుంచి మ‌రింత డేటాను ఇత‌రులు త‌స్క‌రించి.. వాటిని దుర్వినియోగ‌ప‌రిచే వీలుంద‌ని ఫేస్ బుక్ వెల్ల‌డించ‌టం సంచ‌ల‌నంగా మారింది. త‌మ ద‌గ్గ‌రున్న డేటా సేఫ్ అని.. ఎలాంటి భ‌యాందోళ‌న‌లు అక్క‌ర్లేద‌ని చెప్పిన మాట‌ల‌కు భిన్నంగా తాజా నివేదిక రిపోర్ట్ ఉంద‌న్న మాట వినిపిస్తోంది. త‌మ కీర్తిప్ర‌తిష్ట‌ల్ని తీవ్రంగా దెబ్బ తీసేలా ప్ర‌య‌త్నాలు జ‌ర‌గొచ్చ‌న్న సందేహాన్ని.. త‌మ వ్యాపారాన్ని.. ఆర్థిక ఫ‌లితాల్ని ప్ర‌తికూలంగా ప్ర‌భావితం చేయొచ్చ‌న్న మాట‌ను చెప్పింది. సో.. ఏతా వాతా చెప్పేదేమంటే.. ఫేస్ బుక్ లో మీరు పోస్ట్ చేసే స‌మాచారం.. మీ వ్య‌క్తిగ‌త డేటాకు సంబంధించి సెక్యురిటీ ఎంత‌న్న‌ది గాల్లో దీప‌మేన‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇంటిగుట్టు ఇంటికి ప‌రిమితం చేయ‌కుండా సేఫ్ అని ఫీలై.. ఫేస్ బుక్ కు చెప్పేస్తే తిప్ప‌లు త‌ప్ప‌వంతే.