Begin typing your search above and press return to search.
ట్రంప్ ను ఎక్కేసిన ఫేస్ బుక్ జుకర్
By: Tupaki Desk | 28 Jan 2017 11:14 AM GMTఅమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ సంతకం పెట్టేసిన ఎగ్జిక్యూటివ్ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించేందుకు ఉద్దేశించిందని చెబుతున్న ఫైల్ పై సంతకం పెట్టిన ట్రంప్ ను ఉద్దేశించి జుకర్ తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేశారు.
ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచాల్సిన అవసరం కచ్ఛితంగా ఉందని.. దేశానికి ఆపద కలిగించే వారి మీదనే దృష్టి పెట్టాలే కానీ.. సాయం కోసం ఎదురుచూసే వారి కోసం.. శరణార్థుల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండాలన్నారు. ‘‘మనమంతా అలా వచ్చిన వాళ్ల వారసులమే. కొన్ని దశాబ్దాల క్రితం ఇలాగే శరణార్థులను తిప్పి పంపించేసి ఉంటే.. ఈ రోజు ప్రిస్రిల్లా (జుకర్ సతీమణి) కుటుంబం ఇక్కడ ఉండేది కాదు’’ అని పేర్కొన్నారు.
ప్రిసిల్లా చాన్ చైనా.. వియత్నాంల నుంచి అమెరికాకు వలస వచ్చారని..అదే విధంగా తన తాత ముత్తాతల గురించి చెప్పిన జుకర్..‘‘మా తాత ముత్తాతలు కూడా జర్మనీ.. ఆస్ట్రియా.. పోలండ్ ల నుంచి వచ్చిన వారే. ప్రిసిల్లా విషయం వ్యక్తిగతం.కానీ..కొన్నేళ్ల క్రితం మిడిల్ స్కూల్లోక్లాస్ తీసుకున్నప్పుడు చాలామందినా బెస్ట్ స్టూడెంట్స్ వలసదారులు.వాళ్లు మన భవిష్యత్తు కూడా. మనది వలసలతోకూడిన దేశం. ప్రపంచంలోని ఉన్నతమైన.. ప్రతిభావంతులైన వారు ఇక్కడ ఉండటానికి.. పని చేయటానికి అవకాశం లభిస్తే అమెరికాకు చాలా లాభం కలుగుతుంది. ప్రజలందరిని ఒకటిగా చేసి.. ఈ ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దటానికి అవసరమైన ధైర్యం.. సహానుభూతి మన అందరిలోకి రావాలని కోరుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు. జుకర్ చెప్పినవన్నీనిజాలే అయినప్పటికీ.. వాటిని అంగీకరించే పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నారా? అన్నదే అసలు ప్రశ్న. ట్రంప్ లో అదే ఉంటే..ఈ రోజు ఇంతలా మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండేది కాదుగా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/