Begin typing your search above and press return to search.

జుక‌ర్‌ బ‌ర్గ్‌ కు డిగ్రీ...అమెరికన్ల‌కు షాక్ న్యూస్‌

By:  Tupaki Desk   |   26 May 2017 11:25 AM GMT
జుక‌ర్‌ బ‌ర్గ్‌ కు డిగ్రీ...అమెరికన్ల‌కు షాక్ న్యూస్‌
X
ఫేస్‌ బుక్ అధినేత మార్క్ జుక‌ర్‌ బ‌ర్గ్ డిగ్రీ ప‌ట్ట‌భ‌ద్రుడు అయ్యాడు. హార్వ‌ర్డ్‌ లో చ‌దువుకుని డ్రాపౌట్‌ గా బ‌య‌ట‌కు వెళ్లిన జుక‌ర్‌ బ‌ర్గ్‌ ను ఆ యూనివ‌ర్సిటీ గౌర‌వ డిగ్రీతో స‌న్మానించింది. ఈ సంద‌ర్భంగా అమెరికా యువ‌త‌ను ఉద్దేశించి మాట్లాడుతూ జుక‌ర్‌ బ‌ర్గ్ అనేక సూచ‌న‌లు చేశారు. ఇందులో సూచ‌న‌ల‌తో పాటుగా షాకులు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆటోమేష‌న్ (యంత్రీక‌ర‌ణ‌) ఉద్యోగాల‌ను త‌గ్గిస్తుంద‌ని ఫేస్‌ బుక్ అధినేత మార్క్ జుక‌ర్‌ బ‌ర్గ్ జోస్యం చెప్పారు. యంత్రీక‌ర‌ణ వ‌ల్ల ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని దీనికి అనేక రంగాలు ప్ర‌భావితం అవుతాని తెలిపారు.

పెరిగిన సాంకేతిక‌త కార‌ణంగా వ‌చ్చిన ఆటోమేష‌న్ ఫ‌లితంగా భ‌విష్య‌త్తులో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు - ట్ర‌క్కుల వ‌ల్ల ఉద్యోగ కొర‌త ఏర్ప‌డుతుంద‌ని జుక‌ర్ బ‌ర్గ్ విశ్లేషించారు. కొత్త ఉద్యోగాన్వేష‌ణ కోసం యువ‌త ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప‌నిచేయ‌డం నేర్చుకోవాల‌ని జుక‌ర్‌ బ‌ర్గ్ పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు ప‌ని చేయ‌డం ద్వారానే ఉద్యోగాలు వెతుక్కోవాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. స‌మాజానికి హితం చేకూర్చే ప‌బ్లిక్ వ‌ర్క్స్ ప్రాజెక్టుల‌పై దృష్టి పెట్టాల‌ని జుక‌ర్‌ బ‌ర్గ్ సూచించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా టెక్నాల‌జీ అనేక మార్పులు తీసుకువ‌స్తోంద‌న్నారు. ఫేస్‌ బుక్‌ తో పాటు అనేక సంస్థలు అభివృద్ధి చేసిన టెక్నాల‌జీల‌ వ‌ల్ల ఉప‌యోగాలు చాలా ఉన్నాయ‌ని, అలాగే అవి అనేక స‌వాళ్ల‌ను కూడా విసురుతున్న‌ట్లు జుక‌ర్‌ బ‌ర్గ్ చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రి అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా ఉండేలా ప్ర‌పంచాన్ని త‌యారు చేయాల‌ని జుక‌ర్‌ బ‌ర్గ్ యువ‌త‌ను ఉద్దేశించి అన్నారు. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వంలో డిగ్రీ తీసుకొని ప్ర‌సంగించ‌డం సంతోష‌క‌రంగా ఉందని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/