Begin typing your search above and press return to search.

ఫేస్‌ బుక్ ఓనర్‌ కు షాక్..33 వేల కోట్ల నష్టం!

By:  Tupaki Desk   |   20 March 2018 9:25 AM GMT
ఫేస్‌ బుక్ ఓనర్‌ కు షాక్..33 వేల కోట్ల నష్టం!
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్య‌మా అని ఫేస్‌ బుక్ సీఈవో మార్క్ జుకెర్‌ బర్గ్‌ కు పెద్ద షాకే తగిలింది. అయితే అది ప్ర‌త్యక్షంగా కాదు ప‌రోక్షంగా! అమెరికా ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం కోసం పనిచేసిన ఓ సంస్థ.. 5 కోట్ల మంది వినియోగదారుల ఫేస్‌ బుక్ డేటాను దుర్వినియోగం చేసిందన్న విమర్శల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. జుకెర్‌ బర్గ్ ఒక్కడికే 5.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33 వేల కోట్లు) నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఫేస్‌ బుక్‌ లో ఆయన వాటా 16 శాతంగా ఉంది. నష్టం తర్వాత జుకెర్‌ బర్గ్ సంపద 69.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

ఈ నెల తొలి వారంలో విడుదల చేసిన ఫోర్బ్స్ రిచెస్ట్ లిస్ట్‌ లో ఐదోస్థానంలో ఉన్న ఆయన.. ఇప్పుడు రియల్ టైమ్ ర్యాంకింగ్స్‌ లో పదోస్థానానికి పడిపోయారు. ఈ ఊహించని షాక్‌ తో ఫేస్‌ బుక్ కఠిన చర్యలకు దిగింది. ఓ డిజిటల్ ఫోరెన్సిక్స్ సంస్థ సాయంతో అసలు డేటా ఎలా లీకయ్యింది.. ఆ లీకైన డేటాను ఎలా తొలగించాలి అన్నదానిపై పనిచేస్తున్నది. ఫేస్‌ బుక్‌ లాంటి బిజినెస్ మోడల్స్‌ ను నియంత్రించడానికి కొత్త నిబంధనలు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు 6.8 శాతం పడిపోయాయి. అటు ఈ అమ్మకాల ఒత్తిడి ఆపిల్ - గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ లపైనా పడింది.