Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ జుక‌ర్ సిస్ట‌ర్‌ కు లైంగిక వేధింపులు!

By:  Tupaki Desk   |   2 Dec 2017 5:18 AM GMT
ఫేస్ బుక్ జుక‌ర్ సిస్ట‌ర్‌ కు లైంగిక వేధింపులు!
X
ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌రు.. త‌న మేథ‌తో ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసే ఫేస్ బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు జుక‌ర్ బ‌ర్గ్ సోద‌రి ర్యాండి జుక‌ర్ బ‌ర్గ్ ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఫ్లైట్లోని ఫ‌స్ట్ క్లాస్ లో ప్ర‌యాణిస్తున్న జుక‌ర్ సోద‌రికి దారుణ‌మైన లైంగిక వేధింపులు ఎదురైన‌ట్లుగా ఆమె కంప్లైంట్ చేసింది.

ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..

జుక‌ర్ బ‌ర్గ్ సోద‌రి ర్యాండి లాస్ ఏంజెల్స్ నుంచి మెక్సికోలోని మ‌జ‌త్లాన్‌కు వెళుతున్నారు. అలస్కా ఎయిర్ లైన్స్ లో ప్ర‌యాణిస్తున్న ఆమెకు.. తోటి ప్ర‌యాణికుడి నుంచి ఇబ్బందిక‌ర పరిస్థితి ఎదురైంది. ఫ్టైల్లో ప‌లుమార్లు మ‌ద్యం సేవించిన అత‌గాడు.. జుక‌ర్ సిస్ట‌ర్ ను లైంగికంగా వేధించాడు.

మ‌రింత దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి అల‌స్కా విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు లైట్ తీసుకున్న‌ట్లుగా ఆమె పేర్కొన్నారు. రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్ అన్న పేరుతో స‌ద‌రు వ్య‌క్తి చేష్ట‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌న్నారు. తాను ఎదుర్కొన్న ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని జుక‌ర్ సోద‌రి బ‌య‌ట పెట్ట‌టంతో అల‌స్కా విమాన‌యాన సంస్థ రియాక్ట్ అయ్యింది. తాను ప‌డిన లైంగిక క‌ష్టాల గురించి జుక‌ర్ సిస్ట‌ర్ చెబుతూ.. త‌న తోటి ప్ర‌యాణికులు ప‌లుమార్లు మ‌ద్యం సేవించార‌ని పేర్కొన్నారు.

త‌న‌కు స‌మీపంలో కూర్చున్న అత‌గాడు.. త‌న‌తో పాటు ఇత‌ర ప్ర‌యాణికుల‌పై లైంగిక‌.. అస‌భ్య‌క‌ర రీతిలో దుర్బాష‌లు ఆడిన‌ట్లుగా చెప్పారు. తోటి ప్ర‌యాణికుడంటే ఆస‌క్తి లేదా? మోజు లేదా? అని ప్ర‌శ్న‌లు వేయటంతో పాటు త‌న‌ను తాకాలంటూ ఒత్తిడి చేశార‌న్నారు. ఫ్టైట్లో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌ల శ‌రీరాల‌పై అస‌భ్య‌క‌ర‌రీతిలో వ్యాఖ్య‌లు చేశాడ‌ని ఆమె ఆరోపించారు. అత‌డి చేష్ట‌ల్ని భ‌రించ‌లేక కంప్లైంట్ చేస్తే సిబ్బంది ప‌ట్టించుకోలేద‌ని మండిప‌డ్డారు. ఇబ్బంది ప‌డింది ఫేస్ బుక్ జుక‌ర్ సిస్ట‌ర్ అన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చాక అలెస్కా విమాన‌యాన‌సంస్థ రియాక్ట్ అయ్యింది. త‌న తీరుతో ఇబ్బంది పెట్టిన స‌ద‌రు ప్రయాణికుడిపై తాత్కాలిక ప్ర‌యాణ నిషేధాన్ని విధించారు. ఈ మొత్తం ఉదంతంపై విచార‌ణ జ‌రుపుతామ‌ని.. త‌మ‌ను క్ష‌మించాలంటూ విమాన‌యాన సంస్థ పేర్కొన్న‌ట్లుగా చెబుతున్నారు.