Begin typing your search above and press return to search.

ట్రంప్ మాట‌ త‌ప్పన్న ఫేస్ బుక్ అధిప‌తి

By:  Tupaki Desk   |   10 Dec 2015 9:53 AM GMT
ట్రంప్ మాట‌ త‌ప్పన్న ఫేస్ బుక్ అధిప‌తి
X
రెండు రోజులుగా ప్ర‌పంచ దేశాల్లో వాడీవేడి చ‌ర్చ‌కు దారి తీసిన అమెరికా రిప‌బ్లికన్ పార్టీ నాయ‌కుడు డొనాల్డ్ ట్రంప్ మాట‌ల్ని వ్యాపార దిగ్గ‌జం..ఫేస్‌ బుక్ అధినేత మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ త‌ప్పు ప‌ట్టారు. అమెరికాలోకి ముస్లింల‌ను రానివ్వ‌కుండా బ్యాన్ చేయాలంటూ ట్రంప్ పిలుపునివ్వ‌టం.. దీనిపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌ర‌గ‌టం తెలిసిందే.

ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా ఆక్షేపించిన మార్క్ జుక‌ర్‌ బ‌ర్గ్ ముస్లింల‌కు అండ‌గా నిల‌బ‌డ్డాడు. ఎవ‌రో ఏదో దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే.. అందుకు ముస్లింలు అంద‌రూ బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా త‌న తల్లిదండ్రులు.. త‌న చిన్న‌త‌నంలో చెప్పిన మాట‌ల్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఒక జ్యూ మ‌త‌స్తుడిగా త‌న‌పైనే కాదు.. ఏ మ‌తం మీద దాడి జ‌రిగినా ఎదురు నిల‌వాలంటూ త‌న పేరెంట్స్ చెప్పార‌న్న ఆయ‌న‌..ముస్లింల ప‌ట్ల వివ‌క్ష చూపిచ‌టం స‌రికాద‌న్నారు.

ప్యారిస్ న‌గ‌ర‌లో పాల్ప‌డిన న‌ర‌మేధం మొద‌లుకొని ప‌లు ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలకు ప్ర‌పంచంలోని ముస్లింల‌ను బాధ్యులుగా చేయ‌లేమ‌న్న మార్క్.. ముస్లింల‌ను వారి హ‌క్కుల కోసం.. వివ‌క్ష ర‌హిత వాతావ‌ర‌ణం కోసం పోరాడేందుకు ఆహ్వానిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సున్నిత అంశంపై ఎలాంటి త‌డ‌బాటు లేకుండా త‌న అభిప్రాయాన్ని చెప్ప‌న మార్క్ ను అభినందించాల్సిందే.