Begin typing your search above and press return to search.
రామానుజం సినిమా.. జుకెర్ బర్గ్ ఫిదా
By: Tupaki Desk | 28 April 2016 6:29 AM GMTమన గొప్పదనం ఇంకొకరు చెప్పేదాకా మనకు తెలియదు. ప్రపంచం గర్వించదగ్గ గణిత శాస్త్రజ్నుడు శ్రీనివాస రామానుజం జీవిత కథతో తెరకెక్కిన ‘ది మ్యాన్ హు న్యూ ఇన్ఫినిటీ’ సినిమా చూసి ఇప్పుడు ప్రపంచమంతా నివ్వెర పోతోంది. రామానుజం అంత గొప్ప వాడా అంటూ ఆశ్చర్యపోతూ ఆయన గొప్పదనాన్ని ప్రపంచానికి చాటడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ‘ది మ్యాన్ హు న్యూ ఇన్ఫినిటీ’ సినిమాను ఇటీవలే ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ తో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. గూగుల్ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్.. ఓక్లస్ వీఆర్ సీఈవో బ్రెండన్ ఇరిబ్ లాంటి దిగ్గజాల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.
వాళ్లందరూ ఈ సినిమా చూసి అబ్బుర పడ్డారట. రామానుజం గొప్పదనం తెలుసుకుని ఆయన పేరిట ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు జుకెర్ బర్గ్.. పిచాయ్. 25 ఏళ్ల వయసులో ఓ సాధారణ క్లర్క్ గా ఉన్న రామానుజం సొంతంగా గణితశాస్త్రాన్ని ఔపాసన పట్టి.. అంకెల సిద్ధాంతంతో పాటు ఇన్ఫినిటీ సిరీస్.. సహా అనేక మేథమేటిక్స్ సూత్రాల్ని కనిపెట్టి ప్రపంచానికి అందించిన వైనాన్ని హాలీవుడ్ దర్శకుడు మాథ్యూ బ్రౌన్ అద్భుతంగా తెరకెక్కించాడట. రామానుజం కేవలం 32 ఏళ్లకే చనిపోవడం గమనార్హం. ఈ సినిమాలో రామానుజం పాత్రను ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ పోషించాడు. దేవిక అతడి భార్య పాత్రను పోషించింది.