Begin typing your search above and press return to search.

ఇక నుండి లైక్స్ కనిపించవట .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   29 May 2021 5:30 AM GMT
ఇక నుండి లైక్స్ కనిపించవట .. ఎందుకంటే ?
X
సోషల్ మీడియా వాడకం ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పొద్దున్న లేచినప్పటి నుండి సోషల్ మీడియా రకరకాల పోస్టులు పెడుతూ, ఫోటోలు షేర్ చేస్తూ వాటికి వచ్చే లైక్స్ చూసుకుని అనేకమంది తెగ ఆనందపడిపోతుంటారు. అయితే కొంతమందికి తక్కువ లైక్స్ వస్తున్నాయని, వాటిని అందరికీ ఎలా చూపించుకోవాలని తెగ బాధ పడిపోతుంటారు. అలాంటి వారి కోసం ఫేస్‌ బుక్ ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే హైడింగ్ లైక్స్ ఫీచర్. ఫేస్‌ బుక్‌ తో పాటు ఇన్‌ స్టాగ్రామ్ లో కూడా ఈ ఫీచర్‌ ను తీసుకురాబోతోంది.

దీనితో పోస్టుల లైక్స్ చూసి కాకుండా, ఆ పోస్ట్‌ లోని విషయాన్ని బట్టి దానిని నెటిజన్లు ఇష్టపడతారని, కంటెంట్‌ పై దృష్టి సారిస్తారని ఫేస్ బుక్ భావిస్తోంది. అందుకే ఈ కొత్త ఫీచర్‌ ను తీసుకురాబోతోంది. లైక్స్ ద్వారా కొందరు ఏ వీడియో ట్రెండింగ్‌ లో ఉంది అనే విషయం తెలుసుకుంటారు. అలాగే ఎక్కువ లైక్స్ వచ్చిన పోస్ట్‌ ను చూడడం, తక్కవ లైక్స్ వచ్చిన పోస్ట్‌ను పట్టించుకోకపోవడంతో ఆ పోస్టులు పెట్టిన వారిపై మానసికంగా కూడా ప్రభావం పడుతోందట. ఈ క్రమంలోనే ఫేస్‌ బుక్ కొత్తగా మార్పు చేర్పులు చేసింది. కాగా.. ఈ కొత్త టూల్స్‌ ద్వారా తమ యూజర్స్‌ తమ ఖాతాల్లోని ప్రమాదకరమైన కంటెంట్‌ ను ఫిల్టర్‌ చేసుకోగలుగుతారని, అలాగే ఫేస్‌ బుక్‌ న్యూస్‌ ఫీడ్‌ పై ఏది చూడాలి, ఏది పంచుకోవాలి, అనే అంశాలను నియంత్రించగలుగుతారని తెలుస్తోంది. ఇప్పుడు యూజర్స్‌ మరింత ప్రైవసీని, సౌకర్యాలను కోరుకుంటున్నారనీ రాబోయే కొద్ది వారాలో ఈ కంట్రోల్స్‌ అన్నీ కూడా ఫేస్‌ బుక్‌ పై కనిపించనున్నాయనీ ఫేస్‌ బుక్ ప్రకటించింది.