Begin typing your search above and press return to search.
అమితాబ్ గాలి తీసేసిన మాజీ జడ్జి
By: Tupaki Desk | 22 Sep 2016 8:51 AM GMTమార్కండేయ కట్జూ.. ఈ పేరు చెబితే చాలు చాలామందికి వణుకు పుడుతుంది. ఏ అంశం మీద అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఈ సుప్రీం కోర్టు మాజీ జడ్జి శైలి. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా చాలామందిని ఉతికారేశాడు కట్జూ. ఆయన మాటల దాడిని చాలామంది సెలబ్రెటీలు ఎదుర్కొన్నారు. తాజాగా ఆ జాబితాలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా చేరారు. ఎందుకు అమితాబ్ ను టార్గెట్ చేశారో ఏంటో కానీ.. తన వ్యాఖ్యలతో ఆయన గాలి తీసేశారు కట్జూ. మీడియా వాళ్లు అమితాబ్ బచ్చన్ గురించి చాలా గొప్పగా రాసేస్తుంటారని.. ఐతే ఆయనకు అంత సీన్ లేదని.. అమితాబ్ బుర్రలో అసలేమీ లేదని వ్యాఖ్యానించారు కట్జూ.
డబ్బులుంటే ఎవరైనా కబుర్లు చెబుతారని.. అలా చేయండి.. ఇలా చేయండి అంటూ ఉపన్యాసాలు దంచుతారని.. ఊరికే మాటలు చెప్పడం వల్ల ఏ ప్రయోజనం ఉండదని.. గ్రౌండ్లోకి దిగి ఏదైనా చేస్తేనే ఉపయోగం అని కట్జూ అన్నారు. ఈ విషయమై ఆయన ఫేస్ బుక్ లో పెద్ద పోస్టు పెట్టడం విశేషం. అమితాబ్ తాను ఒకే పాఠశాలలో చదువుకున్నామని.. ఆయనతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని కట్జూ వ్యాఖ్యానించారు. అమితాబ్ పై సెటైర్లు వేస్తూ పనిలో పనిగా మీడియా వాళ్లకు కూడా చురకలంటించాడు కట్జూ. ‘‘అమితాబ్ బుర్రలో ఏమీ లేదు. ఆయన్ని అదే పనిగా పొగిడే మీడియా వాళ్లను చూస్తే వాళ్ల బుర్రల్లో కూడా ఏమీ లేదేమో అనిపిస్తుంది’’ అని కట్జూ అన్నారు. ఐతే కట్జూ వ్యాఖ్యలపై అమితాబ్ చిత్రంగా స్పందించాడు. కట్జూ మాటలు వాస్తవమే అని.. తన బుర్రలో ఏమీ లేదని ఆయన అనడం విశేషం.