Begin typing your search above and press return to search.

జయలలితతో ఈయన ప్రేమలో పడ్డాడట!

By:  Tupaki Desk   |   12 Oct 2016 7:09 AM GMT
జయలలితతో ఈయన ప్రేమలో పడ్డాడట!
X
నిజంగానే మాట్లాడతారో, కావాలనే మాట్లడతారో తెలియదు కానీ... నిత్యం విభిన్నమైన ప్రకటనలు చేస్తుంటారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ. నిత్యం వివాదాస్పద ప్రకటనలతో - సంచలన స్టేట్ మెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటారు. పాక్ కు కశ్మీర్ కావాలంటే బీహార్ తో కలిపి ప్యాకేజ్ లా తీసుకొవాలని ప్రకటించిన కట్జూ తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. అయితే ఈసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురించి కావడం విశేషం.

తాజాగా జయలలితపై స్పందించిన కట్జూ... తాను యవ్వనంలో ఉన్నప్పుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ప్రేమలో పడ్డారట. తాను యవ్వనంలో ఉన్నప్పుడు, అదే సమయంలో జయ కూడా యవ్వనంలో ఉన్నారని, ఆ కాలంలో తాను జయలలితతో ప్రేమలో పడ్డానని, ఈ విషయం ఇప్పటివరకూ జయలలితకు తెలియదని కట్జూ అన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నవారిని త్వరలో కోలుకోవాలని కోరుకుంటారు కానీ... ఈయన మాత్రం "ఇప్పటికీ జయలలిత ఆకర్షణీయంగానే కనిపిస్తుంది, ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. ఆమె కోలుకోవాలని కోరుకునే సందర్భానికీ, ఆమె ఆకర్షణీయంగా కనిపిస్తుందనడానికీ ఏమైనా సంబందం ఉందా? అదే మరి కట్జూ స్పెషాలిటీ.

అక్కడితో ఆగని కట్జూ... జయలలితను ఆయన ఆడసింహంగా అభివర్ణించి - షేర్నీ ఔర్ షేర్ అంటూ ఫొటోలను ఫేస్‌ బుక్కులో పోస్టు చేసి తన వ్యాఖ్యలను రాశారు. జయలలిత త్వరలో కోలుకుని తిరిగి పనిలో పడుతారని, జయలలిత ఒక ఆడ సింహం అయితే ఆమె ప్రత్యర్థులు మాత్రం కోతులు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికీ జయలలిత ఆకర్షణీయంగానే కనిపిస్తారని, దురదృష్టవశాత్తు తాను మాత్రం ఆకర్షణీయంగా లేనని, ఇప్పటికీ జయలలితను తాను ప్రేమిస్తున్నానని అంటున్నారు ఈ అవ్యక్త ప్రేమికుడు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/