Begin typing your search above and press return to search.

మార్కాపురం ముచ్చ‌ట వింటే నోట మాట రాదంతే

By:  Tupaki Desk   |   15 Aug 2017 10:05 AM
మార్కాపురం ముచ్చ‌ట వింటే నోట మాట రాదంతే
X
ఏపీలో ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయ‌న్న విష‌యం ఇప్పుడు ఊహించ‌ని రీతిలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సాధార‌ణంగా వ‌ర్షాకాలంలో నీటి కొర‌త లేద‌న్న మాట వినిపిస్తుంటుంది.కానీ.. అందుకు భిన్నంగా.. ఏపీలోని కొన్నిచోట్ల తీవ్ర నీటి ఎద్ద‌డి నెల‌కొంద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాష్ట్రం అంతా ప‌చ్చ‌గా ఉంద‌ని చెప్పుకునే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు మాట‌ల‌కు పూర్తి భిన్నంగా వాస్త‌వం ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక వ్య‌క్తి త‌న ఇంటి కోసం పెట్టిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. ఇదో వార్తాంశంగా మారింద‌ని చెప్పాలి.

ప్ర‌కాశం జిల్లా మార్కాపురం ప‌ట్ట‌ణం తీవ్ర‌నీటి ఎద్ద‌డిని ఎదుర్కొంటోంది. ఈ ప‌ట్ట‌ణంలోని నెహ్రు బ‌జార్ లో ఒక మూడంత‌స్తుల ఇల్లు ఉంది. అందులో మూడో అంత‌స్తుల్లోని వాళ్లు నీటి ఇబ్బందుల కార‌ణంగా ఖాళీ చేశారు. దీంతో.. ఆ ఇంటి య‌జ‌మాని మూడు అంత‌స్తుల్లోని ఇళ్ల‌ను అద్దెకు ఇవ్వాల‌నుకున్నాడు. దీనికిఆయ‌నో చిత్ర‌మైన ప్ర‌క‌ట‌న‌ను త‌యారు చేశారు.

ఒక్కో అంత‌స్తుకు ఒక్కో అద్దెను పేర్కొన‌ట‌మేకాదు.. నీటి కోసం అద‌నంగా నెల‌కు రూ.2వేలు ఇవ్వాల‌ని కోర‌టం క‌నిపిస్తుంది. అంతేనా.. ఇంత డ‌బ్బు చెల్లించినా.. రోజుకు కేవ‌లం రెండు డ్ర‌మ్ముల్లో మాత్ర‌మే నీళ్లు ఇస్తామ‌న్న కండీష‌న్ ను పెట్ట‌టం చూస్తే.. ఏపీలో నీటి కొర‌త ఈ స్థాయిలో ఉందా? అన్న షాక్ త‌గ‌ల‌క మాన‌దు.