Begin typing your search above and press return to search.

వారిద్దరి మధ్య ‘కరోనా’ అడ్డుగా నిలిచినా.. పెళ్లి మాత్రం ఆగలేదు

By:  Tupaki Desk   |   18 March 2020 2:30 AM GMT
వారిద్దరి మధ్య ‘కరోనా’ అడ్డుగా నిలిచినా.. పెళ్లి మాత్రం ఆగలేదు
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా చోటు చేసుకుంటున్న ఉదంతాలు అన్ని ఇన్ని కావు. కరోనా కారణంగా కలవాల్సిన ప్రేమికులు కలవలేకపోవటం.. జరగాల్సిన పెళ్లిళ్లు ఆగిపోవటం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ ప్రభావితమయ్యారు. అలాంటి ఉదంతాల్లో తాజాగా ఒక ఉదంతం బయటకు వచ్చింది.

ముందుగా నిర్ణయించిన వారి పెళ్లిని కరోనా అడ్డుకుంది. కరోనా ప్రభావం తో విదేశాల నుంచి రావాల్సిన వరుడు రాకుండా పోయాడు. అతడు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. ఆ దేశం తీసుకున్న నిర్ణయాలతో ఇండియాకు రాలేకపోయాడు. ఇప్పుడెలా అనుకున్న దానికి టెక్నాలజీ సొల్యూషన్ ఇచ్చింది. దీంతో.. నిన్నటి వరకూ తమ పెళ్లి ఏమవుతుందో అనుకున్న స్థానే.. అనుకున్న ముహుర్తానికి పెళ్లి పూర్తి చేసిన వైనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాకు చెందిన ముస్లిం యువతికి ఖమ్మం యువకుడి తో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కొడుకు ఉద్యోగ రీత్యా సౌదీలో ఉంటాడు. పెళ్లి సమయానికి రావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా సౌదీ నుంచి ఖమ్మంకు రాలేని పరిస్థితి. దీంతో.. ఈ యంగ్ కపుల్ నిరాశకు గురయ్యారు. అయితే.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఉపయోగించి.. అనుకున్న ముహుర్తానికి ఆన్ లైన్ లో వధూవరుడు ఇద్దరు చూసుకుంటుండగా పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. వారి పెళ్లికి కరోనా విలన్ గా మారినా.. వీరిద్దరి పెళ్లిని మాత్రం అడ్డుకోలేకపోయిందని చెప్పాలి. అనుకున్న టైంకు పెళ్లి కావటం తో కొత్త జంట తెగ సంతోషపడిపోయింది.