Begin typing your search above and press return to search.
ఉత్తమ్ కేంద్రంగా టీకాంగ్రెస్ పాలిటిక్స్
By: Tupaki Desk | 25 Feb 2019 8:31 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని ఉబలాటపడుతోంది. ఈ ఓటమికి ప్రధాన కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి అని రాష్ట్ర పార్టీ నాయకులు రగిలిపోతున్నారట.. అందుకే ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొలగించాలని కొందరు సీనియర్ నాయకులు జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి విన్నవించినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలతోనే ఓటమి పాలయ్యామని, ఇప్పుడు ఆయనే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఎదువుతుందని విజ్ఞప్తిలో పేర్కొన్నారట.
పార్టీలో సీనియర్ నాయకులను కలుపుకోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒంటెద్దు పోకడ వ్యవహరిస్తున్నారని, అందుకే కలిసికట్టుగా పనిచేయడం లేదని సీనియర్లు ఆరోపిస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. టిక్కెట్ల విషయంలో తాత్సారం చేయడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొందంటున్నారట. ఈ కారణంగానే ఎవరూ పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని నివేదికలో పొందుపరిచారట..
లోక్ సభ ఎన్నిల్లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మారిస్తే కొన్ని నియోజకవర్గాల్లోనైనా సీట్లు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండా ఈ నివేదికను మర్రిశశిధర్ రెడ్డి కొంతమంది సీనియర్ నాయకులను సంప్రదించి వారి అభిప్రాయాలను తీసుకున్న తరువాతే రాహుల్ గాంధీని కలిశారని సమాచారం..
పార్టీలోని మరో వర్గం మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఎలాంటి వ్యతిరేకత లేదని, మర్రిశశిధర్ రెడ్డికి టిక్కెట్టు దక్కలేదనే కోపంతో ఇలాంటి నివేదిక రూపొందించారని అంటున్నారు. పార్టీలోని నాయకులందరిని కలుపుకోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారని, టిక్కెట్ల కేటాయింపు ఆలస్యం పార్టీ అధిష్టానానికి సంబంధించిన విషయం అని పేర్కొంటున్నారు.