Begin typing your search above and press return to search.
దొంగతనం చేసి పట్టుకోమంటున్న మాజీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 31 Oct 2015 11:42 AM GMTఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చోరీకి పాల్పడ్డారు అంటే ఊహించగలమా? అది కూడా ఆయనే స్టేట్ మెంట్ ఇవ్వడం. వీటన్నింటికీ తోడు తనను పట్టుకోమని సవాల్ విసరడం....పైగా పాతరేస్తా అంటూ హెచ్చరికలు జారీచేయడం....అంతా ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ ఎపీసోడ్ జరిగింది తెలంగాణలో. ఇంత ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చింది సౌమ్యుడిగా ఉండే సీనియర్ ఎమ్మెల్యే, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి. ఈ రేంజ్ లో ఫైర్ అవడానికి కారణం...జీహెచ్ ఎంసీ మాజీ కమిషనర్ సోమేశ్ కుమార్ పై. సవాల్ విసిరింది తెలంగాణ ప్రభుత్వానికి. ఇంతకీ ఆయనేం దొంగతనం చేశారంటారా. ఓటర్ల జాబితా! అదేలా అనుకుంటున్నారా? ఓటర్ల జాబితా తస్కరించానని శశిధర్ రెడ్డే స్వయంగా చెప్పారు మరి.
తాజాగా మీడియాతో మాట్లాడిన శశిధర్ రెడ్డి సోమేశ్ పై ఫైరయ్యారు. జీహెచ్ ఎంసీ కమిషనర్ పదవిలో ఉన్న సమయంలో సోమేష్ కుమార్ తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. సోమేశ్ ను కేవలం బదిలీ చేయడంతో సరిపెట్టవద్దని...ఐఏఎస్ బాద్యతల నుంచే తొలగించాలనే డిమాండ్ చేశారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన సనత్ నగర్ నియోజకవర్గంలో 25 వేల ఓట్లు తొలగించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. సోమేశ్ పైనే కాకుండా ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
"సనత్ నగర్ నియోజకవర్గంలో 25,000 ఓట్లు తొలగించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవి జీహెచ్ ఎంసీ ఆఫీసు నుంచి నేనే తస్కరించాను. ప్రభుత్వానికి దమ్ముంటే నాపై చర్యలు తీసుకోవాలి. సోమేష్ కుమార్ ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ కావాలనే ఓట్లను తొలగించారు. ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల బృందానికి అన్ని ఆధారాలు సమర్పించాను. ఈ తతంగానికి కారణమైన సోమేష్‌ను పాతరేస్తాం" అంటూ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగా సౌమ్యంగా ఉండే శశిధర్ ఈ రేంజ్ లో ఫైరవడం అందులో భాగంగా పాతేస్తాను అనే రేంజ్ లో హెచ్చరికలు జారీచేయడం ఆసక్తిని రేపుతోంది.