Begin typing your search above and press return to search.
ఉత్తమ్ వల్లే ఈ పరిస్థితి...మర్రి ప్లాన్ బీ ఇదేనా
By: Tupaki Desk | 17 Nov 2018 11:36 AM GMTకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సొంత పార్టీలోని పరిణామాలపై ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మూడో జాబితాలో టికెట్ రాకపోవడంతో మర్రి భగ్గుమన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే తనకు సనత్నగర్ టికెట్ రాలేదని స్పష్టం చేశారు.సనత్ నగర్ స్థానం కావాలని టీడీపీ అడగనే లేదు. తనకు సీటు రాకుండా ఉండేందుకు కొందరు గట్టి ప్రయత్నాలు చేశారు. టీడీపీ వద్దని చెప్పినా కూడా బలవంతంగా సనత్ నగర్ స్థానాన్ని ఆ పార్టీకే కేటాయించారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఆయన ప్రత్యామ్నాయల వైపు చూస్తున్నారని అంటున్నారు.
సనత్ నగర్ నుంచి తానైతేనే గెలుస్తానన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లోనూ ఉందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ``ప్రస్తుతం నేను రెండు విషయాల్లో కలత చెందుతున్నాను. మర్రి శశిధర్ రెడ్డి గెలువలేడు అని స్క్రీనింగ్ కమిటీ ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా చెప్పడం - ఉత్తమ్ చేయించిన సర్వేలో తాను గెలవలేను అని తేలిందనడం నన్ను బాధించాయి. కొన్ని ఛానెళ్లు చేయించిన ఆన్ లైన్ సర్వేల్లో నాకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ఒకవేళ నాకు టికెట్ కేటాయించలేనప్పుడు అభ్యర్థుల బలాబలాలు కూడా చూడాలి. ప్రకటించిన జాబితాను మరోసారి పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నాను. రాజకీయాల్లో నాకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. ప్రభుత్వం - పార్టీలో ఎన్నో కీలక పదవులలో పని చేశాను. అలాంటి నా విషయంలోనే కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించారు`` అని మర్రి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మర్రి శశిధర్ రెడ్డి తనకు ఆప్షన్స్ ఉన్నాయని ప్రకటించడం ఆసక్తికరంగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం మూడు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడం లేదా ఏదైనా జాతీయ పార్టీ గానీ - చిన్న పార్టీ నుంచి గానీ పోటీ చేయడం అలా కాని పక్షంలో ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు ఏదైనా నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నించడం. అయితే, 3వ ఆప్షన్ వైపు శశిధర్ మొగ్గు చూపే అవకాశం లేదని అంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని ప్రకటించిన మర్రి శశిధర్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేయవచ్చంటున్నారు. మొదట్నుంచే కాంగ్రెస్ కు నమ్మినబంటుగా ఉన్న ఆయన మరో పార్టీ నుంచి పోటీ చేయడం అనుమానమేనని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు.