Begin typing your search above and press return to search.
దేశాన్ని ఆకర్షిస్తున్న యంగ్ ఎమ్మెల్యే.. యంగ్ మేయర్ పెళ్లి.. ఎప్పుడంటే?
By: Tupaki Desk | 17 Feb 2022 4:31 AM GMTజగన్పెద్దయ్యాక ఏమవుతావ్? అని అడిగితే రాజకీయాల్లోకి వెళతాన్న మాట మినహా అన్ని రంగాల్లోకి వెళతామన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి రోజుల్లో రాజకీయాల్ని కెరీర్ గా మలుచుకొని రావటం ఒక ఎత్తు.. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజకీయ నేతలుగా ఎదగటం మరో ఎత్తు.
ఈ విషయంలో ఈ ఇద్దరు యంగ్ పొలిటిషన్లు ఇప్పటికే ఎవరికి వారుగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. వారిలో ఒకరు 28 ఏళ్ల యంగ్ ఎమ్మెల్యే అయితే.. మరొకరు దేశంలోనే అత్యంత పిన్న వయసులో మేయర్ గా ఎన్నికైన మహిళా నేత మరొకరు. అలాంటి ఈ ఇద్దరు రాజకీయ నేతలు పెళ్లి బంధంతో మరింత దగ్గరైతే అంతకు మించిన ఆసక్తికర అంశం ఇంకేం ఉంటుంది? తాజాగా ఈ పెళ్లి పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ ఇద్దరు యంగ్ పొలిటిషియన్లు కేరళ రాష్ట్రానికి చెందిన వారు.
28 ఏళ్ల సచిన్ దేవ్ కేరళలోని బలుస్సేరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇక దేశంలోనే అత్యంత పిన్న వయసులోనే తిరువనంతపురం (త్రివేండ్రం) మేయర్ గా ఎంపికయ్యారు 23 ఏళ్ల ఆర్య రాజేందర్. వీరిద్దరూ సీపీఎం పార్టీ నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కాబోతున్న వైన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఈ రెండు కుటుంబాల మధ్య ఒప్పందంతో పాటు.. నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఆర్య.. సచిన్ లు ఇద్దరు చిన్ననాటి స్నేహితులే కాదు.. ఇద్దరు కలిసి వామపక్ష పార్టీకి చెందిన విద్యార్థి విభాగమైన ఎస్ఎఫ్ఐలో కలిసి పని చేశారు. మేయర్ గా ఎన్నికైన ఆర్య.. తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కాలేజ్ విద్యార్థిగా ఉన్న వేళలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయటం.. ఆమె కాస్తా విజయం సాధించటం.. అనంతరం ఆమెను మేయర్ గా ఎన్నుకోవటంతో దేశంలోనే అత్యంత చిన్న వయసులో మేయర్ గా బాధ్యతల్ని చేపట్టి రికార్డును క్రియేట్ చేశారు. ఒక కాలేజీలో చదివే అమ్మాయి.. ఏకంగా త్రివేండ్రం నగరానికి ప్రధమ పౌరురాలిగా అవతరించటం విశేషంగా చెప్పాలి.
మేయర్ ఆర్య పెళ్లాడబోతున్న ఎమ్మెల్యే సచిన్ ట్రాక్ రికార్డు కూడా తక్కువేం కాదు. ఆయన తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి.. ప్రముఖ నటుడు ధర్మజన్ బోల్గట్టిపై పోటీ చేసి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కేరళ రాష్ట్రంలో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి నేతగా అవతరించారు. ఈ ఇద్దరు నేతలు చిన్నతనంలో బాలసంఘంలో కలిసి పని చేయటం.. అప్పటి వారి పరిచయం వారితో పాటు పెరుగుతూ పెద్దది కావటమే కాదు.. చివరకు పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. అయితే.. వీరి వివాహం ఎప్పుడన్న అంశంపై మాత్రం ఇంకా తేల్లేదు. త్వరలోనే డేట్ ఫిక్సు చేస్తారని చెబుతున్నారు. ఈ యంగ్ పొలిటికల్ కఫుల్ వెడ్డింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తోంది.