Begin typing your search above and press return to search.

చనిపోయిన ప్రేమికులకు పెళ్లి.. ఈ పెద్దోళ్లు ఉన్నారే..!

By:  Tupaki Desk   |   20 Jan 2023 5:30 PM GMT
చనిపోయిన ప్రేమికులకు పెళ్లి.. ఈ పెద్దోళ్లు ఉన్నారే..!
X
''ఈ పెద్దోళ్లు ఉన్నారే చిన్నవాళ్ళ ప్రేమను ఎన్నటికీ అర్థం చేసుకోలేరు' అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇద్దరు లవర్స్ ను తల్లిదండ్రులు విడదీసే క్రమంలోనే హీరో ఉదయ్ కిరణ్ చెబుతాడు. ఈ డైలాగ్ అప్పట్లో తెగ ఫేమస్ అయింది. ఇప్పటికీ చాలామంది లవర్స్ ఈ డైలాగ్ ను ఇష్టపడుతుంటారు. కారణంగా ఆ డైలాగ్ నిజ జీవితానికి దగ్గరగా ఉండటమే.

పిల్లలు ప్రేమించడం.. పెద్దలు నిరాకరించడం అనేది కామన్ గా మారిపోయింది. ఒకరిద్దరు తల్లిదండ్రులు మినహా పిల్లల ప్రేమను పెద్ద మనస్సుతో ఒప్పుకుంటున్న ఘటనలు తక్కువే అని చెప్పొచ్చు. తల్లిదండ్రులు ప్రేమకు పూర్తిగా విలన్లు అని కాదుగానీ వారి భయాలు వారికి ఉంటాయి. ఈ క్రమంలోనే నిజమైన ప్రేమికులు తల్లిదండ్రులను ఒప్పించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఇటీవల కాలంలో గుజరాత్ లోని తాపీ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో తరుచూ ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకుంటుండం కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది గణేష్.. రంజన అనే ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడటం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని తాపీ జిల్లా నెవాలా గ్రామానికి చెందిన గణేష్.. రంజన కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ ఇరువురి ఇంట్లో తెలియడంతో నానా రభస జరిగింది. ఈ క్రమంలోనే వీరివురూ ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు గ్రామ పెద్దల సహకారం తీసుకున్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు.

దీంతో కలిసి బ్రతకలేమని డిసైడ్ లవర్స్ చనిపోయి ఒకటి కావాలని అనుకున్నారు. గ్రామంలోని ఓ చెట్టు కొమ్మకు వీరిద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన చూసి గ్రామంలోని పెద్దలు.. గ్రామస్థులు చలించిపోయారు. వీరి స్మృతిగా ఈ జంట విగ్రహాలను తయారు చేయించారు. వీరి మరణం ఇరువురి కుటుంబంలో ఎంతో మార్పును తీసుకొచ్చింది.

పిల్లల ప్రేమను అర్థం చేసుకోకపోవడం వల్లే వారు ప్రాణాలను తీసుకున్నారని తల్లిదండ్రులు బాధపడ్డారు. వీరి చివరి కోరికను తీర్చేందుకు ఆ ప్రేమికులకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ జంట విగ్రహాలను తయారు చేయించి గ్రామంలోని పెద్దలు.. బంధుమిత్రుల సమక్షంలో జనవరి 14న ఘనంగా పెళ్లి చేశారు. దీంతో ఏడాది తర్వాత ఈ ప్రేమ జంట విగ్రహాల రూపంలో ఒక్కటైంది.

వీరి చివరి కోరికను తీర్చడం ద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా చనిపోయిన ప్రేమికులకు విగ్రహాల రూపంలో పెళ్లి చేయడంతో దేశంలో ఇదే మొదటిసారి అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ పనిదే ఏడాది క్రితం చేసి ఉండే రెండు ప్రాణాలు నిలిచేవి కాదా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.