Begin typing your search above and press return to search.
పెళ్లిళ్లు ఒక వైపు.. విడాకులు ఇంకో వైపు!
By: Tupaki Desk | 9 April 2022 11:30 PM GMTతొమ్మిది మంది భార్యలు ఉన్న బ్రెజిలియన్ మోడల్ అందులో ఒక భార్యకు మాత్రమే విడాకులిస్తున్నాడు. బ్రెజిల్ మోడల్ లైఫ్ స్టైల్ అలా ఉంది. కానీ ఇక్కడ ఒక భార్యతోనే వేగలేక విడాకులిస్తున్న సౌత్ హీరోల్ని చూసి జాలి పడేవాళ్లు లేకపోలేదు. కానీ భారతదేశ సెలబ్రిటీ ప్రపంచంలో విడాకుల వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్ గా మారుతోంది.
పెళ్లిళ్లు ఒక వైపు.. విడాకుల వార్తలు ఇంకో వైపు ..! ఇదీ నేటి ట్రెండ్. ఓవైపు ఫలానా హీరో ఫలానా హీరోయిన్ పెళ్లాడేస్తున్నారు అంటూ కథనాలొస్తున్నాయి. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ తో ఒకటవుతున్నారు. పెళ్లి మూడ్ అంతా బాగానే కనిపిస్తోంది. కానీ ఇంతలోనే కలతలు విడాకులు అంటూ మరోవైపు వార్తలు వినడం విచారకరం.
2021 ఎండింగ్ లో టాలీవుడ్ బడా ఫ్యామిలీ నుంచి ఇలాంటి వార్త అభిమానుల్ని కలచివేసింది. అక్కినేని నాగచైతన్య- సమంత జంట విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడం కల్లోలానికి కారణమైంది. దీనిని అభిమానులు నమ్మలేకపోయారు. ఇప్పుడు ఆ ఇద్దరూ ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా మళ్లీ బిజీ లైఫ్ లోనే సేదా దీరాల్సిన పరిస్థితి. చై-సామ్ కంటే ముందే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు నుంచి విడిపోతున్నట్టు ప్రకటించడం కల్లోలం రేపింది.
ఇటీవల కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ - సౌందర్య జంట విడిపోతున్నట్టు ప్రకటించి బిగ్ షాకిచ్చారు. ఈ జంట 18 ఏళ్ల కాపురంలో కలతలు ఏర్పడి విడాకులు తీసుకున్నామని వెల్లడించారు. 23 ఏళ్ల వయసులో సౌందర్యను 21 ఏళ్ల ధనుష్ పెళ్లాడారు. ఈ జంటకు యాత్ర- లింగ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో సర్ (వాతి-తమిళం) సినిమా లాంచ్ వేడుకలో ధనుష్- సౌందర్య జంటగా పూజా కార్యక్రమాలు చేశారు. కానీ ఇంతలోనే విడిపోతున్నామని ప్రకటించడం షాకిచ్చింది.
ఈ వార్త ఇలా ఉండగానే మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడిపోతున్నారన్న ప్రచారం మెగాభిమానుల్లో కలతకు కారణమవుతోంది. గడిచిన కొన్ని నెలలుగా ఈ జంట మధ్య సఖ్యత లేదు అంటూ మీడియా కథనాలు వైరల్ అవుతున్నాయి. దీనిని ఖండించకపోగా.. ఇంతకుముందు శ్రీజ ఇన్ స్టా టైటిల్ మార్చుకోవడం చర్చనీయాంశమైంది. ఇన్ స్టా.. శ్రీజ కొణిదెలగా మార్పుతో కనిపించడంతో గుసగుసలు నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఇరువైపుల నుంచి ఈ గాసిప్స్ ని ఖండిస్తూ వార్త వెలువడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక టాలీవుడ్ నుంచి మరో యువహీరో కూడా భార్య నుంచి విడిపోతున్నారని గుసగుసలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఓ ఇద్దరు ప్రముఖ తెలుగు దర్శకులు హీరోయిన్ల తో ఎఫైర్ల కారణంగా భార్య నుంచి విడిపోనున్నారని గుసగుసలు ఇంతకుముందు స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఆ గుసగుసలు సద్దుమణిగాయి. బాలీవుడ్ లో మాజీ విశ్వసుందరి సుశ్మితాసేన్ .. మోడల్ రోహ్మన్ షాల్ నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు. బంధంలో నమ్మకం చాలా ముఖ్యం. ఈ మగాళ్లు మారరు! అంటూ సుశ్మితా సేన్ తనలోని ఆవేదనను వ్యక్తం చేశారు. జంటలు ఇలా కలతలతో విడిపోవడం అభిమానులకు నిరాశనే కలిగిస్తోంది. మరోవైపు అంగరంగ వైభవంగా ప్రేమ వివాహాలు పరిశ్రమలో నిరంతరం కనిపిస్తున్నాయి.