Begin typing your search above and press return to search.
పంతులుగారి లేని పెళ్లి అధికారికమే!
By: Tupaki Desk | 10 Nov 2015 5:30 PM GMTహిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే పంతులుగారు ఉండాల్సిందే. అయితే.. పంతులుగారు లేకుండా జరిగే పెళ్లి కూడా చట్టబద్ధమేనంటూ సంచలన తీర్పు చెప్పేసింది మద్రాస్ హైకోర్టు. పంతులుగారు.. సంప్రదాయం ప్రకారం జరగాల్సిన తంతు.. లాంటివి ఏమీ లేకుండా సింఫుల్ గా వధువు మెడలో వరుడు తాళి కడితే.. దాన్ని కూడా పెళ్లిగానే భావించాలని తేల్చేసింది.
పెళ్లికి పంతులుగారి అవసరం లేదని.. ఆత్మగౌరవపద్ధతిలో పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని తేల్చారు. పెళ్లి వేడుకలో పంతులుగారి లేని పెళ్లిళ్లు చెల్లవని చెప్పటం సరికాదంటూ మద్రాస్ హైకోర్టుకు ఒక కేసు విచారణకు వచ్చింది. 1968 హిందూ వివాహ చట్టానికి అప్పటి తమిళనాడు సర్కారు ఒక సవరణ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఒక న్యాయవాది పిల్ వేశారు. దీనిపై విచారణ జరిగిన సందర్భంగా.. హిందూ మతం విభిన్న సంస్కృతుల సమ్మేళనం అని.. ప్రాంతాల వారీగా పెళ్లిళ్లు జరుగుతుంటాయని.. అందువల్ల సంప్రదాయం ఒకే విధంగా ఉండవని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి.. వేదమంత్రాలు.. సప్తపదితో సంబంధం లేకుండా పెళ్లి కూతురు మెడలో పెళ్లికొడుకు తాళి కట్టేస్తే పెళ్లి అవుతుందని.. దానికి చట్టబద్ధత ఉందని తేల్చి చెప్పింది. ఈ విషయంలో నాడు తమిళనాడు ప్రభుత్వం చేసిన సవరణను కోర్టు పూర్తిగా సమర్థిస్తూ.. పిల్ ను కొట్టేసింది.