Begin typing your search above and press return to search.
తాలిబన్ల హుకూం: 12 ఏళ్లు పైబడిన అమ్మాయిలకు పెళ్లి
By: Tupaki Desk | 17 Aug 2021 11:30 PM GMTఅప్ఘనిస్తాన్ ను చేజిక్కించుకున్న తాలిబన్లు తమ అరాచకాలకు తెరతీస్తున్నారు. ఇప్పటికే తుపాకీ చేతబట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి ప్రధానంగా మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఇంట్లో అవివాహితులుగా ఉన్న 12 ఏళ్ల బాలికల నుంచి 45 ఏళ్ల మహిళలను తమకిచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడికి గురిచేస్తున్నారట..
యుద్ధంలో గెలిచిన తమ యోధులకు వీరంతా శృంగార బానిసలుగా ఉండాలని బెదిరిస్తున్నారు.. ఇటీవలే 15-45 ఏళ్ల స్త్రీలను పెళ్లి చేసుకుంటామని ప్రకటించగా.. ఇప్పుడు 12 ఏళ్లు పైబడిన వారిని అప్పగించాలని హుకూం జారీ చేస్తున్నారట..
20 ఏళ్ల కిందట తాలిబన్లు పాలించిన అప్ఘనిస్తాన్ ను ఇప్పుడు మళ్లీ ఆక్రమించారు. దాదాపు ఆ సమయంలో పెట్టిన నిబంధనలే మళ్లీ విధిస్తున్నారు. బాలికలను కిడ్నాప్ చేస్తున్నారు. మహిళలపై దారుణాలు చేస్తున్నారు. ఇక్కడ క్షణమొక యుగంలా సాగుతోంది జీవనం అంటూ అప్ఘన్ సినీ దర్శకురాలు సహ్ర కురిమి బహిరంగంగా లేఖ రాశారు. ‘గత కొన్ని రోజులుగా తాలిబన్లు దేశాన్ని ఆక్రమించే క్రమంలో ప్రజలను చిత్ర హింసలు పెడుతున్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి అంతా కూలిపోతుంది. ఇళ్లు లూటీ చేస్తున్నారు. ఎవరైనా వారి ఆగడాలకు అడ్డు వస్తే కాల్చిపారేతస్తున్నారు.
తాలిబన్లు ఉన్నప్పుడు స్కూళ్లలో ఒక్క అమ్మాయి కూడా కనిపించేది కాదు. మొన్నటి వరకు ప్రభుత్వం హయాంలో 9 మిలియన్ల బాలికలు పాఠశాలలకు వెళ్లారు. చక్కగా చదువుకుంటున్న వారి జీవితంలో తాలిబన్లు నిప్పులు పోస్తున్నారు. వారి చదువు సంగతి దేవుడెరుగు.. అసలు వారు బయటకు వస్తే బతుకుడే పెద్ద గగనంలా మారింది.
మరోవైపు తాలిబన్ల రాకతో అక్కడి నుంచి ప్రజలు ఇప్పటికే ఇతర ప్రదేశాలకు పయనమయ్యారు. అప్ఘనిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లడానికి కాబూల్ విమానాశ్రయం తప్ప వేరే మార్గం లేదు. అయితే ఈ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడికి తీవ్రంగా మారింది. కొందరు విమానం టైర్లను పట్టుకొని వేలాడిన వీడియో వైరల్ గామారింది. ఇక ఈ విమానాశ్రయం సిబ్బంది తాలిబన్లు ప్రవేశించారనగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో విమానాల రాకపోకలు ఇబ్బంది ఏర్పడింది. బయటికి వెళ్లాలనుకునే వారు ఏదో రకంగా మార్గం చూసుకుంటున్నారు.