Begin typing your search above and press return to search.

వివాహితులూ అందుకు మొగ్గుచూపుతున్నారట !

By:  Tupaki Desk   |   28 Jan 2020 5:30 PM GMT
వివాహితులూ అందుకు మొగ్గుచూపుతున్నారట !
X
వివాహేతర సంబంధాల మోజులో ఎన్ని సంసారాలు ఛిద్రమవుతున్నాయో చూస్తున్న కూడా అనైతిక బంధాల కోసం ఎదురుచూసే వారు పెరుగుతోంది. తాజాగా వివాహేతర డేటింగ్‌ యాప్‌లో ఏకంగా ఎనిమిది లక్షల మంది వివాహితులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తమ భాగస్వాములను మోసం చేస్తూ సాగిస్తున్న రహస్య బంధాల్లో స్ర్తీ, పురుషులు ఇద్దరూ పాలుపంచుకోవడం విశేషం. ఈ డేటింగ్‌ యాప్‌లో టెక్‌ హబ్‌ బెంగళూర్‌ నుంచి అత్యధిక సంఖ్యలో సబ్‌ స్క్రైబర్లు నమోదయ్యారు. జనవరి తొలి వారంలో డేటింగ్‌ యాప్‌ కు సబ్‌ స్క్రైబర్లు విపరీతంగా పెరిగిపోయారు.

ఈ ఏడురోజులూ రోజుకు 300 శాతం చొప్పున సబ్‌స్క్రిప్షన్‌ పెరగ్గా, నెలమొత్తంలో వచ్చిన సబ్‌స్క్రిప్షన్ల కంటే తొలి వారంలో వచ్చినవి ఏకంగా 250 శాతం అధికం. నూతన సంవత్సర వేడుకలు ముగిసి దంపతులు తమ పనుల్లో నిమగ్నమవడంతో పాటు పిల్లల వింటర్‌ వెకేషన్‌ ముగిసిన క్రమంలో వివాహేతర బంధాల డేటింగ్‌ యాప్‌కు సబ్‌ స్క్రిప్షన్‌లు వెల్లువెత్తాయని ఈ నివేదిక వెల్లడించింది.

ఈ యాప్‌ లో ఎక్కువ మంది బెంగళూర్‌, ముంబై, హైదరాబాద్‌, కోల్‌కతా, ఢిల్లీ, పూణే, చెన్నై, గుర్‌గావ్‌, అహ్మదాబాద్‌, జైపూర్‌, చండీగఢ్‌, లక్నో, కొచ్చి, నోయిడా, వైజాగ్‌, నాగపూర్‌, సూరత్‌, ఇండోర్‌, భువనేశ్వర్‌ నగరాలకు చెందిన వారు అధికం గా ఉన్నారు. ఈ యాప్‌ వృద్ధి 567 శాతం పైగా ఉండటం తో వివాహ బంధానికి వెలుపల అనైతిక బంధాల కోసం ఎంతగా వెంపర్లాడుతున్నారనేది వెల్లడవుతోందని ఫ్రెంచ్‌ ఆన్‌లైన్‌ డేటింగ్‌ కమ్యూనిటీ వేదిక నివేదిక తెలిపింది.