Begin typing your search above and press return to search.
లూడో గేమ్ లో పరిచయమైనోడి కోసం పాక్ వెళ్లబోయింది
By: Tupaki Desk | 7 Jan 2022 10:30 AM GMTప్రేమ గుడ్డిదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజా ఉదంతం గురించి తెలిస్తే.. నిజంగా నిజమని గొంతెత్తి గట్టిగా చెప్పేస్తారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఆన్ లైన్ గేమ్ లో పరిచయమైనోడి కోసం ఇంటిని.. కుటుంబాన్ని వదిలేసి.. పాకిస్థాన్ కు పయనమైన ఒక ఇల్లాలి కథ. అయితే.. ఒక ఆటోడ్రైవర్ సమయస్ఫూర్తితో ఆమె ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉంది. ఇంతకూ జరిగిందేమంటే..
రాజస్థాన్ కు చెందిన ఒక వివాహితకు ఆన్ లైన్ లో లూడో గేమ్ ఆడే అలవాటు ఈ మధ్యనే అయ్యింది. తరచూ ఆన్ లైన్ లో లూడోకు అలవాటైన ఆమెకు.. పాకిస్థాన్ కు చెందిన ఒక టీనేజర్ పరిచయమయ్యాడు. అది కాస్తా వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. అతనితో కలిసి జీవిద్దామని ఈ వివాహత డిసైడ్ అయ్యింది. ముందుగా వేసుకున్న ప్లాన్ తో కుటుంబాన్ని వదిలేసింది. ఇంటి నుంచి కొంత డబ్బు.. బంగారాన్ని తీసుకొని బయలుదేరింది. అమ్రత్ సర్ లో ఉన్న వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ కు చేరుకోవాలని ఆమె ప్రియుడు సూచించాడు.
దీంతో.. ఆమె వాఘా సరిహద్దు వద్దకు చేరుకుంది. తన టీనేజర్ బాయ్ ఫ్రెండ్ చెప్పినట్లుగా.. తాము అనుకున్న ప్రాంతానికి చేరుకోవటం కోసం ఆటో ఎక్కింది. అయితే.. దారి చెప్పే విషయం ఆమెకు అర్థం కాకపోవటంతో..ఫోన్ ను ఆటో డ్రైవర్ కు ఇచ్చింది. అవతల వ్యక్తి మాటలతో విషయాన్ని అర్థం చేసుకున్న ఆటోడ్రైవర్.. సదరు పాకిస్థానీ కుర్రాడు చెప్పిన ప్లేస్ కు కాకుండా నేరుగా పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే వారున్న వద్దకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయాన్ని తెలుసుకున్న వారు.. ఆమెకుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ఆన్ లైన్ లో లూడో గేమ్ లో పరిచయమయ్యాడని.. ఇంటిని దేశాన్ని విడిచిపెట్టి.. పరాయి దేశానికి వెళ్లేందుకు సిద్దమైన ఆమె తెగింపునకు అధికారులు సైతం షాక్ తిన్న పరిస్థితి.