Begin typing your search above and press return to search.
ఆమెకు పెళ్లయింది.. కానీ, ప్రియుడు పదేపదే గుర్తుకొస్తున్నాడు.. ఏం చేసిందంటే!
By: Tupaki Desk | 10 Nov 2022 2:30 AM GMTఆమెకు పెళ్లయి మూడేళ్లు అయిపోయింది. కానీ, ప్రియుడిని మాత్రం మరిచిపోలేక పోయింది. వివాహానికి ముందు గాఢంగా ప్రేమించిన వాడిని వదలలేకపోయింది. ఇటు భర్తతో ఉండలేక... అటు ప్రేమించిన వాడిని మరవలేక సతమతమైంది. మరోవైపు ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో వివాహం... ఎడబాటు భరించలేక... ఇరువురు కలిసి రైల్వే ట్రాక్‌పై పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది.
గూడ్స్ రైలు కింద పడి యువతీయువకులు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఉడుతల వెంకటేష్ కుమారుడు గణేశ్ (25), అదే గ్రామానికి చెందిన తోట లక్ష్మి కుమార్తె నలంద (23)గా గుర్తించారు. నలందకు మూడేళ్ల క్రితం యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన యాదగిరితో వివాహం జరిగింది. మృతురాలి భర్త యాదగిరిగుట్ట దేవస్థానంలోని లడ్డూ తయారీ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లికి ముందే నలందకు గణేశ్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది.
మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో యాదగిరి డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి భార్య ఇంట్లో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులకు రైల్వే అధికారుల నుంచి సమాచారం అందింది.
బహుపేట పరిధిలోని రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాలు పడి ఉండడంతో గమనించిన సిబ్బంది.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. యాదగిరిగుట్ట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు. నలంద, గణేశ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.