Begin typing your search above and press return to search.
మోడీ చంపించకపోతే.. నేనే చంపేస్తా
By: Tupaki Desk | 29 April 2017 3:32 PM ISTఉగ్రదాడిలోనో.. తీవ్రవాదుల దాడిలోనో.. ఏదైనా ప్రమాదంలోనో సామాన్యులు ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వాలకది చిన్న విషయంగానే ఉంటుంది. కానీ తమ కుటుంబ సభ్యుడిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందన్నది అది అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయే జవాన్లను వీరులని.. అమరులని కితాబులిచ్చేసి పరిహారం ఇచ్చేస్తే సరిపోదు. అమానుషంగా ఆ జవాన్లను చంపిన ముష్కరుల్ని మట్టుబెడితే కాస్తయినా బాధిత కుటుంబాలు కొంచెం ఉపశమనం పొందుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైతే ఉగ్రవాదుల్ని చంపి తనే ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఆవేశంగా స్పందించిందివీర మరణం పొందిన ఓ జవాన్ తల్లి.
కుప్వారాలో జరిగిన ఉగ్రదాడిలో ఒక కెప్టెన్ ఆయుష్ యాదవ్ సహా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయుష్ తల్లి తీవ్ర ఆవేదనతో మీడియాతో మాట్లాడింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు ప్రధాని మోడీ కఠిన చర్యలు తీసుకోని పక్షంలో తానే స్వయంగా ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటానని ఆమె ఆవేశంగా అంది. దాడి ఘటనకు ముందు రోజు తనతో మాట్లాడిన కుమారుడు.. మరుసటి రోజే ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆయుష్ యాదవ్ తండ్రి కూడా ఆవేదనతో మాట్లాడాడు. ప్రభుత్వంపై తనకెలాంటి నమ్మకం లేదని అసహనం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడింది జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారుగా భావిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు మిలిటెంట్లను సైన్యం మట్టుబెట్టగా.. మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/