Begin typing your search above and press return to search.
కోట్లు ఉన్నా మారుతీరావు సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు?
By: Tupaki Desk | 9 March 2020 10:00 AM GMTకోట్ల ఆస్తి ఉంది. డబ్బు, పరపతి ఉంది. అయినా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది ఎవరికి అంతుచిక్కని ప్రశ్న. మారుతీరావు ఆత్మహత్యకు కారణం ఏంటని ఇప్పుడు అందరినీ తొలుస్తున్నా ప్రశ్న.
మారుతీరావు ఆత్మహత్యకు డబ్బు కొరత అస్సలు కారణం కాదు.. ప్రధానంగా మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మిర్యాల గూడ పట్టణ సమీపంలో ని ఈదులగూడెంలో భారీ వ్యాపార సముదాయం ఉంది. ఆ ఆస్తిని అమ్మడానికి పెట్టాడు. కానీ బ్యాంకు లోను ఉండడం.. హత్య కేసులో ఇరుక్కొని ఉండడంతో మారుతీరావు నుంచి కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. బ్యాంకు నుంచి నోటీసులు జారీ చేయడం తో ఆ ఆస్తిని అమ్మలేక.. అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.
అమృత ప్రేమ వివాహం.. అల్లుడి హత్య నేపథ్యంలోనే మారుతీరావు తీవ్ర మానసిక ఒత్తిడిలో పడిపోయారు. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు హైదరాబాద్ లో చికిత్స సైతం తీసుకుంటున్నారు. అయితే మందులు అయిపోయాయట.. మరోవైపు ప్రణయ్ హత్య కేసు విచారణకు రావడం.. న్యాయవాదిని మాట్లాడుకునే ప్రయత్నంలో హైదరాబాద్ తిరగడం.. ఆస్తులున్నా అమ్మదామంటే కొనలేక చేతిలో డబ్బులు లేకపోవడం మారుతీరావుకు ఇబ్బందిగా మారింది. భారీగా ఆస్తులన్నా వాటిని విక్రయిస్తే వాటిని కొనేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేకపోవడం తో మారుతీరావుకు ఆర్థిక కష్టాలు వచ్చాయి.
ఆస్తులున్నా అమ్ముడు పోక.. వ్యాపారాలు జరగక మారుతీరావు రూ.50వేల కోసం ఇబ్బంది పడుతున్నాడు. మిత్రుల తో తన బాధను వ్యక్తం చేశాడు. ప్రణయ్ కేసు నుంచి బయటపడేందుకు న్యాయవాదిని కలిసేందుకు మారుతీరావు హైదరాబాద్ వెళ్లారు. ఈ కేసులో చార్జిషీట్ లో దాఖలు చేశారు. ఈ కేసు నుంచి బయటపడడం కష్టమని చెప్పడంతో మారుతీరావు మానసిక క్షోభకు గురయ్యాడు. ఉరిశిక్ష తప్పదని పలువురు న్యాయవాదులు చెప్పడం తో విలపించి ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.