Begin typing your search above and press return to search.
పెళ్లికి ముందు మారుతీరావు కోటిన్నర డీల్!
By: Tupaki Desk | 18 Sep 2018 4:54 AM GMTతమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమించిన కుమార్తెను తనకు నచ్చినట్లుగా పెళ్లి చేసుకోవటం కోసం మిర్యాలగూడ మారుతిరావు భారీ స్కెచ్ వేసినట్లుగా తాజాగా బయటకు వచ్చింది. ప్రేమించినోడ్ని పెళ్లాడిన తన కుమార్తె భర్తను హత్య చేయటానికి కోటి రూపాయిల సుపారీ ఇచ్చిన మారుతీరావు.. పెళ్లికి ముందు ప్రణయ్.. అమృతలను విడదీసేందుకు భారీ స్కెచ్ వేసిన వైనం తాజాగా బయటకు వచ్చింది.
సరిగ్గా ఏడాదిన్నర కిందట.. ప్రణయ్.. అమృత పెళ్లికి ముందు మారుతీరావు ఒక భారీ ప్లాన్ వేశారు. కాంగ్రెస్ నేత కరీం.. టీఆర్ ఎస్ పార్టీకి చెందిన మరో నేతతో కలిసి.. ప్రణయ్ కుటుంబానికి కోటిన్నర ఇస్తానని.. తన కుమార్తెను మర్చిపోవాలని చెప్పినట్లుగా తెలిసిందే.
తన డీల్ కు ఒప్పుకుంటే ప్రణయ్ తండ్రి ఉద్యోగాన్ని వేరే చోటకు బదిలీ చేయిస్తానని.. ఇందుకుగాను కుటుంబ సభ్యులంతా తమ సిమ్ కార్డుల్ని తనకు ఇచ్చేయాల్సి ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ నేతల నుంచి ప్రణయ్ కుటుంబంపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్లుగా చెబుతున్నారు.
రాజకీయ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో వస్తున్న ఒత్తిళ్లతో వారు ఆ దిశగా అడుగులు వేస్తున్న వేళ.. ప్రణయ్ వారి డీల్ ను బ్రేక్ చేసినట్లుగా చెబుతున్నారు. అమృత తండ్రికి వంద కోట్ల ఆస్తి ఉంటే..తమకు పది కోట్ల ఆస్తి ఉందని.. వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని ప్రణయ్ తేల్చి చెప్పటంతో.. డీల్ క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.
ఇది జరిగిన ఆర్నెల్లకే వీరిద్దరూ హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా మారుతీరావు నుంచి భారీ ఎత్తున ఒత్తిళ్లు వస్తున్న వేళ.. ఒకదశలో విదేశాలకు వెళ్లి సెటిల్ కావాలని ప్రణయ్ ఆలోచన చేసినట్లుగా చెబుతున్నారు. మిర్యాలగూడకు దూరంగా వెళ్లిపోయేందుకు రెఢీ అయినా.. అమృత మాత్రం నో చెప్పింది. మిర్యాలగూడలోనే ఉందామని.. తమ డాడీకి తానంటే ప్రాణమని.. ఆయన కోపం తగ్గుతుందన్న ఆశను వ్యక్తం చేయటంతో వారు ఊళ్లోనే ఉండిపోవాల్సి వచ్చినట్లుగా చెబుతున్నారు.
అమృత మాటలతోనే ప్రణయ్ తమ కాపురాన్ని హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు మార్చినట్లుగా చెబుతున్నారు. కొంతకాలం వారి జీవితం సాఫీగా సాగినా.. ఈ ఏడాది ఆగస్టులో అమృత కోరిక మేరకు ఆమె అత్తమామలు రూ.15లక్షల ఖర్చుతో రిసెప్షన్ వేడుకను నిర్వహించారు. ప్రణయ్ మిత్రుడు ఒకరు వీడియో ఆల్బమ్ ను సినిమా పాట తరహాలో చిత్రీకరించారు. ఆ వీడియోను అమృత ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయగా.. 30వేల లైకులు వచ్చాయి. ఇదే విషయాన్ని తన తండ్రికి అమృత చెప్పగా.. మీ పాటకు వచ్చిన లైకుల కంటే నేను ప్రణయ్ ను భూమ్మీద లేకుండా చేసే వీడియోకే ఎక్కువ లైకులు వస్తాయన్న వార్నింగ్ ఇచ్చారట. దీంతో.. అలెర్ట్ అయిన దంపతులు.. అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా ఉండటం మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.
అమృత సూచన మేరకు ప్రణయ్ పోలీసుల్ని ఆశ్రయించటంతో పాటు.. ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలోనూ ప్రణయ్ కు అమృత జాగ్రత్తలు చెబుతూ ఉండేది. బెదిరింపు కాల్స్ వచ్చిన వేళలోనూ అమృత సూచనతో ప్రణయ్ పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. మారుతీరావు తీరుపై అనుమానాలకు తగ్గట్లే..కూతురు పెళ్లాడిన భర్తను దారుణంగా చంపేందుకు భారీ స్కెచ్ వేసినట్లుగా చెబుతున్నారు.