Begin typing your search above and press return to search.

బయటకి వస్తే Masakali 2.0 వినాల్సిందే... పోలిసుల సంచలన నిర్ణయం !

By:  Tupaki Desk   |   13 April 2020 7:00 AM GMT
బయటకి వస్తే  Masakali 2.0 వినాల్సిందే... పోలిసుల సంచలన నిర్ణయం !
X
కరోనాను అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమల్లో ఉండటంతో ...నిత్యావసర సరుకులు తీసుకోవడానికి బయటకి రావాలి. అది కూడా కేవలం కుటుంబానికి ఒకరే ఇంటి నుండి బయటకి రావాలి. మిగిలిన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి గడప దాటి ఎవరు బయటకి రాకూడదు. కానీ, కొంతమంది ఆకతాయిలు లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి రోడ్ల పైకి వచ్చేస్తున్నారు.

మొదట్లో పోలీసులు చాలా రకాలుగా చెప్పినా విన లేదు. కొట్టినా తిట్టినా మళ్లీ రోడ్లపైకి వచ్చేస్తునే ఉన్నారు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు వినూత్న రీతిలో శిక్షలు వేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారికి కొత్త శిక్షలు అమలు చేస్తున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌ లో లాక్ డౌన్ ఉల్లంఘించే ఆకతాయిల తిక్క కుదుర్చుతున్నారు.

అవసరం లేకపోయినా మీరు రోడ్ల పై తిరుగుతూ కనిపిస్తే.. మిమ్మల్ని ఒక రూంలో పెట్టి Masakali 2.0 పాటను తిప్పి తిప్పి ప్లే చేస్తాం అని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. భూషణ్ కుమార్ కు చెందిన టి-సిరీస్‌ లో ఈ పాట రీమిక్స్ ‘Masakali 2.0’గా కంపోజర్ తనీష్ బాగ్చితో ప్రారంభించారు. గాయకులు తులసి కుమార్, సాచెట్ టాండన్ పాడారు. సినిమా పాట అసలు వెర్షన్ పాడారు. సింగర్ మోహిత్ చౌహాన్, ఢిల్లీ 6 చెప్పారు. అక్కడ "Masakali" RECREATED వెర్షన్ ఏ పాయింట్ అది కూడా పోలికే లేదు. అసలు ట్రాక్‌ ను ప్రసూన్ జోషి రచించారు.