Begin typing your search above and press return to search.
సినిమాల్లో కూడా కనిపించని సీన్లను రియల్ గా చూపిస్తున్న చైనా
By: Tupaki Desk | 19 Feb 2020 4:30 AM GMTరోజుల్లోనే ఊరిని బాగు చేయటం. హీరో తలుచుకుంటే కొండ మీద కోతి సైతం కిందకు రావటం. అద్భుతమైన ప్రాజెక్టులు.. బిల్డింగులు అప్పటికప్పుడు క్రియేట్ కావటం లాంటివన్నీ సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే సీన్లు. సరిగ్గా అనుకోవాలే కానీ రీల్లోనే కాదు రియల్ గా కూడా చేయలేని పని అంటూ ఏమీ ఉండదన్న విషయాన్ని చేతల్లో చేసి మరీ చూపిస్తోంది చైనా.
ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని కల్పిస్తుందన్న సూత్రాన్ని నమ్మినట్లుగా ఉంది డ్రాగన్ దేశం. మాయదారి కొవిడ్ 19 వైరస్ కారణంగా అతలాకుతలమైపోతున్న ఆ దేశం ఇప్పుడు తమ సత్తా చాటేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి విస్మయానికి కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న వెయ్యి పడకల ఆసుపత్రిని కేవలం ఎనిమిది రోజుల్లో పూర్తి చేయటమే కాదు.. యుద్ధ ప్రాతిపదికన 1500 పడకల ఆసుపత్రిని పన్నెండు రోజుల్లో పూర్తి చేసి చూపించారు. ఇలాంటివన్నీ కాల్పనిక కథల్లో మాత్రమే సాధ్యమనుకునే స్థానే.. కాదు.. కాదు.. చైనావాళ్లకు కూడా సాధ్యమేనన్న భావన కలిగేలా చేస్తున్నారు.
ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపించేది ఒక్కటే.. సైతాను వైరస్ వెతుక్కొని.. వెతుక్కొని చైనా లాంటి దేశంలోనే ఎందుకొచ్చిందంటే.. తన సత్తాకు సరిపోయే వాళ్లు వారేననిపిస్తుంది. నిజంగానే ఈ పిశాచి వైరస్ మరే దేశంలో అయినా వ్యాప్తి చెంది ఉంటే.. ఆ దేశం ఎంతలా ఆగమాగమైపోయేదో తలచుకుంటేనే వణుకు పుడుతుంది. కొవిడ్ విసురుతున్న సవాళ్లకు రెట్టించిన పట్టుదలతో పని చేస్తున్న చైనీయులు మరో అద్భుతాన్ని ఆవిష్కరించే ప్రయత్నంచేస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనీయులకు అవసరమైన ఫేస్ మాస్కులు ఏ మాత్రం సరిపోవటం లేదు. తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన అంటే.. కేవలం ఆరంటే ఆరు రోజుల్లో మాస్కుల్ని తయారీ చేసే కర్మాగారాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. బీజింగ్ లోని ఒక పారిశ్రామిక భవంతిని కేవలం ఆరు రోజుల్లో కర్మాగారంగా తీర్చిదిద్దనున్నారు.
దీన్లో రోజుకు 2.5లక్షల మాస్కుల్ని ఉత్పత్తి చేయనున్నారు. ఈ శనివారం నాటికి అందుబాటులోకి వచ్చేలా.. షిప్టుల వారీగా కార్మికులు పని చేయనున్నారు. అవసరానికి అనుగుణంగా ఇలాంటి ఫ్యాక్టరీలు మరో.. రెండు మూడు సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి సీన్లు అయితే సినిమాల్లో లేదంటే.. చైనాలోనే సాధ్యమనే దానికి మీరు ఒప్పుకుంటారు కదా?