Begin typing your search above and press return to search.
ఒమిక్రాన్ వ్యాప్తిలో వాడాల్సిన మాస్కులు ఇవే
By: Tupaki Desk | 29 Dec 2021 11:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో అయితే కేసుల సంఖ్య లక్షను దాటింది. మరో వైపు కొత్త వేరియింట్ ఒమిక్రాన్ కూడా తన ప్రభావం ప్రపంచ దేశాల మీద చూపుతుంది. వైరస్ వ్యాప్తి అంచలంచలుగా పెరుగుతుందని వివిధ దేశాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరో వైపు వైరస్ ను అదుపు చేసేందుకు టీకా పంపిణీ కార్యక్రమాన్ని కూడా భారీ స్థాయిలో చేపడుతున్నాయి.
మరో వైపు కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ను తప్పని సరిగా పాటించాలని నిపుణలు చెప్తున్నారు. ప్రతీ ఒక్కరూ గతంలానే మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటిచడం, వ్యాక్సిన్ డోసులు కచ్చితంగా పూర్తి చేసుకోవడం లాంటివి చేయాలని కోరుతున్నారు. ఇవి పాటిస్తే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది వైరస్ నుంచి దూరంగా ఉండేదుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా నడుచుకోవాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే కరోనా మొదటి వేవ్ సమయంలో ప్రజలు పాటించిన జాగ్రత్తలో ముఖ్యమైంది. మాస్క్ ధరించడం. అయితే కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తరువాత చాలా మంది మాస్కులు పెట్టుకోవడం చాలా వరకు ఆపేశారు. అయితే ఈ పద్ధతి మంచిది కాదని అధికారులు చెప్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా కానీ మాస్క్ పెట్టుకోవాలని కోరుకుతున్నారు. లేక పోతే వైరస్ మరోసారి సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.
మరో వైపు ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉపయోగించే మాస్కులు కూడా మారాలని నిపుణలు చెప్తున్నారు.
ఒమిక్రాన్ కు వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉండడంతో మూడు లేయర్లు ఉండే మాస్కులను వాడాలని సూచిస్తున్నారు. గుడ్డతో తయారు చేసినవి అయినా కూడా మూడు లేయర్లు ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. ఎన్ 95, కేఎన్ 2, ఎఫ్ఎఫ్‌పీ 2 లాంటి మాస్కులు వాడితే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. వీటిలో కూడాను ముక్కు, నోరుని కవర్ చేసేలా ఉండే మాస్కులు వాడాలని కోరుతున్నారు.