Begin typing your search above and press return to search.

క‌శ్మీర్ అంశంలో తాలిబన్లను సాయం అడిగిన జైషే

By:  Tupaki Desk   |   28 Aug 2021 4:37 AM GMT
క‌శ్మీర్ అంశంలో తాలిబన్లను సాయం అడిగిన జైషే
X
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం మొదలైంది. అక్కడ అమెరికా సాయంగా ఏర్పడిన ప్రభుత్వం కూలిపోయి , తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా ఆనంద పడింది పాకిస్థాన్. తాజాగా ఆ విషయం బట్టబయలైంది. క‌శ్మీర్ అంశం పై త‌మ‌కు సాయం చేయాల‌ని తాలిబ‌న్ నాయ‌క‌త్వాన్ని పాక్ నుంచి జ‌మ్ము క‌శ్మీర్‌ లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న జైషే మ‌హ్మ‌ద్ కోరిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు జైషే మ‌హ్మ‌ద్ వ్య‌వ‌స్థాప‌క అధినేత మౌలానా మ‌సూద్ అజ‌ర్ ఇటీవ‌ల ముల్లా అబ్దుల్ ఘ‌నీ బారాదార్‌ తోపాటు ఇత‌ర తాలిబ‌న్ల నేత‌ల‌తో భేటీ అయిన‌ట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి.

జ‌మ్ముక‌శ్మీర్ లోయ‌లో జైషే మ‌హ్మ‌ద్ కార్య‌క‌లాపాలు చేప‌ట్టేందుకు సాయం చేయాల‌ని తాలిబ‌న్ల‌ను కోరిన‌ట్లు వార్తలు వచ్చాయి. ఈ మేర‌కు మౌలానా మ‌సూద్ అజ‌ర్‌, కాంద‌హార్‌ కు వెళ్లిన‌ట్లు తెలుస్తుంది. ఈ నెల 15న కాబూల్‌ ను తాలిబ‌న్లు వ‌శం చేసుకుని విజ‌యం సాధించిన మ‌రుస‌టి రోజు మ‌సూద్ అజ‌ర్ సంతోషం వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అమెరికా మ‌ద్ద‌తుతో పాల‌న సాగించిన ఆఫ్ఘ‌న్ స‌ర్కార్‌ ను కూల్చివేసినందుకు తాలిబ‌న్ల‌ను ఆయ‌న ప్ర‌శంసించిన‌ట్లు స‌మాచారం. పాకిస్థాన్‌ లోని బ‌హ‌వాల్పూర్‌ లో గ‌ల జైషే మ‌హ‌మ్మ‌ద్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో సంస్థ స‌భ్యులు ఒక‌రినొక‌రు అభినందించుకున్న‌ట్లు తెలుస్తుంది.

ఈ మేర‌కు ఆఫ్ఘ‌నిస్థాన్‌ లో ముజాహిదిన్ల విజ‌యం అని పేర్కొంటూ మ‌సూద్ అజ‌ర్‌ మెసేజ్ పంపిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. తాలిబన్ల విజయాన్ని పాకిస్థాన్‌ లోని బహవల్‌ పూర్‌ లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంలో సంతోషంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ చట్టం షరియాను వివరించడంలో సైద్ధాంతిక కామ్రేడ్లుగా తాలిబన్లను, జైషే మహమ్మద్ ఉగ్రవాదులను పరిగణిస్తారు. అయితే, ఏ దేశంలో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను అనుమ‌తించ‌బోమ‌ని ఇంత‌కుముందు తాలిబ‌న్లు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఆఫ్ఘానిస్థాన్‌ లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో ఖాట్మాండ్ నుంచి లక్నోకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాకిస్థాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్‌ కు తీసుకెళ్లి ప్రయాణికులకు బదులుగా మన దేశంలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ సహా ముగ్గురని ఉగ్రవాదులు విడిపించుకున్న విషయం తెలిసిందే. అయితే రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు అప్ఘానిస్తాన్ మళ్లీ తాలిబన్ల హస్తగతమైన వేళ.. జైషే మొహమ్మద్ శ్రేణుల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. తాలిబాన్ల అండ చూసుకుని కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెంచాలని జైషే మొహమ్మద్ భావిస్తోంది. మసూద్ అజహర్ 1999లో భారత జైలు నుంచి విడుదలైన తర్వాత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. జమ్మూకాశ్మీర్‌ లో ఉగ్ర కార్యకలాపాలను పెంచేందుకు నాటి నుంచి నేటి వరకు ప్రయత్నాలు కొనసాస్తూనే ఉంది.