Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ ఎంత అబద్ధం చెప్పింది

By:  Tupaki Desk   |   19 Jan 2016 4:20 AM GMT
పాకిస్థాన్ ఎంత అబద్ధం చెప్పింది
X
దాయాదిదేశం బుద్ధి మరోసారి బయటపడింది. పటాన్ కోట్ ఎయిర్ బేసే మీద జరిగిన ఉగ్రదాడికి కర్త..కర్మ.. క్రియ అన్నీ తానై నడిపి జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ పేర్కొనటం తెలిసిందే. ఈ వ్యాఖ్యపై పెద్ద ఎత్తున విస్మయం వ్యక్తమైంది. భారత్ గడ్డ మీద జరిగిన ఒక ఉగ్రదాడి విషయంలో పాక్ సర్కారు ఇంత వేగంగా స్పందించి.. బాధితుల్ని అదుపులోకి తీసుకోవటమా అన్న ప్రశ్న వ్యక్తమైంది.

పాక్ ప్రకటనపై విస్మయం వ్యక్తమైన కాసేపటికే.. పాక్ ప్రభుత్వం మసూద్ అరెస్ట్ మీద మాట తిప్పేయటం.. గృహనిర్బధం లాంటి మాటల్ని చెప్పుకొచ్చింది. అయితే.. ఇలా చెప్పిన మాటలన్నీ వట్టివేనని తాజాగా తేలిపోయింది.

భారత్ ను తప్పుదారి పట్టించేందుకే ఇలాంటి వాదనలు వినిపించారన్న విషయం తాజాగా బయటకు వచ్చాయి. మసూద్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పిన ఎపిసోడ్ మొత్తం ఉత్తదేనని నిఘా వర్గాలు తేల్చేస్తున్నాయి. మసూద్ వ్యవహారంలో పాక్ అన్నీ అబద్ధాలే చెప్పిందని నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. పటాన్ కోట్ ఇష్యూపై పాక్ అధికారులు ఒక ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారని.. ఈ ముగ్గురికి పటాన్ కోట్ ఉదంతం కంటే కూడా ఇతర కేసుల్లో ఉన్న ఆరోపణల నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తేల్చారు. కపటత్వానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే పాక్ తనకున్న పేరు ప్రఖ్యాతులకు తగ్గట్లే వ్యవహరించిందని చెప్పక తప్పదు.