Begin typing your search above and press return to search.

వైసీపీ స‌ర్కారుపై మూకుమ్మ‌డి దాడి.. ఇంత వ్య‌తిరేక‌త‌కు కార‌ణాలేంటి?

By:  Tupaki Desk   |   24 Jan 2022 3:30 PM GMT
వైసీపీ స‌ర్కారుపై మూకుమ్మ‌డి దాడి.. ఇంత వ్య‌తిరేక‌త‌కు కార‌ణాలేంటి?
X
ఏపీలో వైసీపీ స‌ర్కారుపై కీల‌క నాయ‌కులు సైతం ఊహించ‌ని విధంగా.. దాడి ప్రారంభ‌మైంది. వాస్త‌వానికి.. ఏదైనా ఆప‌ద పొంచి ఉంటే.. దీనిని ప‌సిగ‌ట్టేందుకు.. కీల‌క నేత‌కు ఉప్పందించేందుకు.. ఇంటిలిజెన్స్ ఉంది. అయితే.. ఇప్పుడు జ‌రుగుతున్న ఉద్య‌మం.. ప్ర‌భుత్వంలోని అన్ని విభాగాలు, శాఖ‌లు ఒక్క‌తాటి పైకి రావ‌డం.. అనేది గ‌తంలో ఎన్న‌డూ లేదు. ఇప్పుడు మాత్ర‌మే జ‌రుగుతున్న ప‌రిణామం. అంద‌రూ క‌లిసి పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో హైకోర్టు సిబ్బంది కూడా పాలుపంచుకున్నారు. విధులకు హాజరవుతూనే తమ నిరసనను వ్యక్తం చేశారు.

అదేవిధంగా న్యాయ శాఖ ఉద్యోగులు..ఖ‌జానా ఉద్యోగులు.. సంఘాలు.. ఇలా..అనేక వ‌ర్గాలు.. ఉద్యోగులు.. ప్ర‌భుత్వానికి ఊహించ‌ని విధంగా షాక్ ఇచ్చాయి. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ఇలా మూకుమ్మ‌డిగా .. ఒక్క‌సారిగా స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు? అనేది అత్యంత కీల‌క అంశంగా మారింది.

ఎందుకంటే.. ఇప్ప టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ తాను ఏం చేసిన‌ప్ప‌టికీ.. చెల్లుతుంద‌ని.. త‌న మాటే శాస‌నం కావాల‌ని భావిస్తూ.. వ‌స్తున్నార‌నేది ఉద్యోగుల్లో ఉన్న మాట‌. ఉదాహ‌ర‌ణ‌కు సినీ ప‌రిశ్ర‌మ‌ను తీసుకుంటే.. ఎవ‌రి మాట‌కూ విలువ ఇవ్వ‌కుండా.. తాను చేసిందే వేదం.. తాను చెప్పిందే వేదం.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారని ఉద్యోగులు అంటున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్పుడు తాము కూడా ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి లొంగితే.. మున్ముందు.. మ‌రింత‌గా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌నే భావ‌న‌.. ఉద్యోగుల్లో నెల‌కొంద‌ని అంటున్నారు. పైగా.. తాము చేస్తున్న‌దే క‌రెక్ట్.. అందు కే ఎవ‌రూ రోడ్డు ఎక్క‌డం లేద‌ని.. కూడా వైసీపీ పెద్ద‌లు చెబుతున్నార‌ని.. నిజంగా ఈ భావ‌న ఉండ‌డం వ‌ల్లే.. త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని.. ఉద్యోగులు అంటున్నారు.

ఇలాంటి వాటిని ఆదిలోనే వ్య‌తి రేకించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఉద్యోగులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే అంద‌రూ సంఘటిత మ‌య్యార‌నే వాద‌న వినిపిస్తోంది. లేక‌పోతే.. ఒక‌టిరెండు ఉద్యోగ సంఘాల‌కు మాత్ర‌మే ఈ ఉద్య‌మం ప‌రిమితం అయ్యేద‌ని అంటున్నారు. మొత్తానికి తాను ప‌ట్టుకున్న కుందేలుకు.. అన్న‌ట్టుగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌నే తాము ఉద్య‌మిస్తున్నామ‌న్న‌.. ఉద్యోగుల విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.