Begin typing your search above and press return to search.
బెంగళూరు మగాళ్లు మరీ అంత మృగాళ్లా?
By: Tupaki Desk | 2 Jan 2017 4:34 PM GMTదారుణం.. దుర్మార్గం. ఆరాచకం.. అంతకు మించిన పదాలు ఉంటే అవన్నీ కూడానా. ఇండియా సిలికాన్ వ్యాలీగా.. మర్యాదస్తులకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే బెంగళూరు మహానగరంలో చోటు చేసుకున్న ఈ ఆరాచకం వింటే షాక్ తినాల్సిందే. డిసెంబరు 31వ రాత్రి వేళ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని భావించిన బెంగళూరు అమ్మాయిలు.. తమ జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాన్ని ఇచ్చారు.
అర్థరాత్రి వేళ న్యూఇయర్ సంబరాల జోష్ ను ఎంజాయ్ చేద్దామని రోడ్ల మీదకు వచ్చిన బెంగళూరు అమ్మాయిలపై.. గార్డెన్ సిటీ అబ్బాయిలు కొందరు చేసిన రచ్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. పూటుగా మద్యం తాగి.. రోడ్ల మీదకు వచ్చిన బెంగళూరు సిటీ కుర్రాళ్లు కాసేపు హల్ చల్ చేసేశారు.
మద్యం మత్తులో ఉంటే ఏమైనా చేసేయొచ్చన్నట్లుగా వారి తీరు ఉందని చెప్పాలి. రోడ్ల మీదకు వచ్చిన అమ్మాయిల్ని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ నానా యాగీ చేశారు. మొదట్లో ఏదో సందడిగా ఉన్న వేళ జరిగిన పొరపాటుగా భావించిన అమ్మాయిలు.. పదే పదే జరుగుతున్న దుర్మార్గాన్ని చూసి అలెర్ట్ అయ్యారు. బెంగళూరు సిటీలో ఫేమస్ అయిన ఎంజీ రోడ్.. బ్రిగేడ్ రోడ్ లో చోటు చేసుకున్న ఈ దుర్మార్గపు వ్యవహారంతో భీతిల్లిన అమ్మాయిలు..పరుగులు పెట్టారు.
తమకు కనిపించిన మహిళా పోలీసులకు.. తమకు జరిగిన దారుణాన్ని చెప్పి బోరుమన్నారు. న్యూఇయర్ వేడుకల కోసం రోడ్ల మీదకు రావటం పాపంగా మారి.. చేదు అనుభవాన్ని మిగిల్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. బెంగళూరు నగర పోలీసు విభాగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే.. డిసెంబరు 31వ రాత్రి సిటీ అమ్మాయిల విషయంలో.. బెంగళూరు అబ్బాయిలు కొందరు చేసిన రచ్చను ఒక జాతీయ పత్రికకు చెందిన ఫోటో గ్రాఫర్ ఫోటోల్ని తీయటంతో.. గార్డెన్ సిటీలో జరిగిన దారుణం ప్రపంచం దృష్టి పడేలా చేసింది. ఇప్పటివరకూ మర్యాదస్తుల నగరంగా పేరున్న బెంగళూరు సిటీకున్న మంచిపేరు..తాజా ఘటనతో ఒక్కసారి తుడిచిపెట్టుకుపోయిందన్న భావన వ్యక్తమవుతోంది. మరి.. అర్థరాత్రి వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆరాచకం సృష్టించిన మూకలపై బెంగళూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/