Begin typing your search above and press return to search.

బాండీ బీచ్ లో సామూహిక నగ్న ఫోటో షూట్.. వైరల్..!

By:  Tupaki Desk   |   26 Nov 2022 11:30 PM GMT
బాండీ బీచ్ లో సామూహిక నగ్న ఫోటో షూట్.. వైరల్..!
X
సముద్ర అలల తీరంలో కాసేపు సేద తీరాలని ఎవరికీ ఉండదు చెప్పండి. రోటిన్ లైఫ్ కు దూరంగా వెళ్లి గడపాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తుకు వచ్చేది బీచ్ లంటే అతిశయోక్తి కాదేమో.. ఇక మనకు అతి దగ్గరలో విశాఖ నగరంలో విశాఖ బీచ్ ప్రకృతి సోయగాలతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

ఇక పొరుగు రాష్ట్రాల్లో అయితే చైన్నె.. గోవా.. కేరళలోని బీచ్ లు పర్యాటకులకు మెస్మరైజ్ చేస్తుంటాయి. ఇక విదేశాల్లో అయితే దర్శకుడు పూరీ జగన్నాథ్ తరుచూ వెళ్లే బ్యాంకాక్ బీచ్ లతోపాటు తదితర బీచ్ లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. బీచ్ లకు వెళ్లే వారంతా కాసేపు ప్రకృతిలో సేద తీరడానికి.. ఫ్రెండ్స్ లేదంటే ఫ్యామిలితో రిలాక్స్ కావడానికో వెళుతుంటారని అందరికీ తెల్సిందే.

అయితే ఆస్ట్రేలియన్లు బీచ్ లో వినూత్న కార్యక్రమం చేపట్టి ప్రపంచం దృష్టిని వారివైపు తిప్పుకోవడం చర్చనీయాంశంగా మారిందీ. ఇంతకీ ఆస్ట్రేలియా చేసిన వినూత్న కార్యక్రమం ఏంటో తెలిస్తే మీరు కూడా ప్రశంసించకుండా ఉండలేరు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ చర్మ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక ప్రాజెక్టుకు పూనుకున్నాడు.

ఇందులో భాగంగా 2500 మందిని ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ కు రప్పించాడు. వీరందరితో దుస్తులన్నీ విప్పించి నగ్నంగా నిలబెట్టాడు. సముద్ర అలలతోపాటు వీరందరి నగ్న చిత్రాలను ఒకే ఫ్రేములో వచ్చేలా ఫోటో షూట్ చేశాడు. నేడు బాండీ బీచ్ లో జరిగిన సామూహిక నగ్న ఫోటో షూట్ తర్వాత స్పెన్సర్ టునిక్ మీడియాతో మాట్లాడారు.

ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉందని స్పెన్సర్ టునిక్ తెలిపారు. చర్మ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు బీచ్ లో ఇవాళ సామూహిక నగ్న ఫోటో షూట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించాడు. ఇకపోతే ఆస్ట్రేలియాలోని బీచ్ లో నగ్నంగా తిరిగేందుకు అక్కడి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ అవకాశాన్ని స్పెన్సర్ టునిక్ ఇలా వినియోగించుకోవడం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.