Begin typing your search above and press return to search.
లాస్ వెగాస్ లో కాల్పులు..ఇద్దరి మృతి
By: Tupaki Desk | 2 Oct 2017 9:12 AM GMTఅమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. క్యాసినో నగరం లాస్ వెగాస్‌లో ఓ అంగతకుండి కాల్పుల ఘటనలో ఇద్దరు మృతిచెందగా...24 మంది గాయపడ్డారు. మండలే బే హోటల్ వద్ద కంట్రీ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న సందర్భంగా ఈ ఘటన జరిగాయి. మాండలై బే రిసార్ట్ లోని 32వ అంతస్తులో దేశీయ సంగీత ఉత్సవం సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ వ్యక్తి కాల్పులకు దిగినట్లు అనుమానిస్తున్నారు. కాల్పులకు తెగబడ్డ సాయుధుడిని హతమార్చినట్టు లాస్ వేగాస్ పోలీసులు ధ్రువీకరించారు. అయితే ఆయన వివరాలను వెల్లడించలేదు.
కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి వేల సంఖ్యలో జనం పారిపోతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ అయ్యాయి. గన్ పేల్చిన శబ్ధాలు కొన్ని వీడియోల్లో వినిపిస్తోంది. ఈ కాల్పులు షూటింగ్ జరిగిన ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులు ఉన్నారు. గన్ కాల్పుల వల్ల కలిగిన గాయాలతో అనేక మంది ఆస్పత్రులకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కాల్పుల వల్ల ఇద్దరు మృతిచెందారు. మరో 24 మంది గాయపడినట్లు తెలుస్తున్నది.. కాల్పుల ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు. సంఘటన స్థలం వైపు ప్రజలు ఎవరూ రాకూడదని పోలీసులు సూచించారు. అక్కడ అణువణువు గాలిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి పలువురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని - సీసీటీవీ పుటేజ్ లను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటనతో లాస్ వెగాస్ లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దుండగుడ్ని పట్టుకుంటామని ఎల్వీఎంపీడీ పోలీసులు తెలిపారు. అలాగే కేసినోకు దగ్గర్లో ఉన్న విమానాశ్రయానికి వచ్చే పలు విమానాలను దారిమళ్లించారు. విమానాశ్రయంతో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.