Begin typing your search above and press return to search.

మధ్యధరా సముద్రం లో భారీ ప్రమాదం .. 130 మంది మృతి !

By:  Tupaki Desk   |   24 April 2021 5:34 AM GMT
మధ్యధరా సముద్రం లో భారీ ప్రమాదం .. 130 మంది మృతి !
X
ఆఫ్రికా లిబియా సముద్ర తీర ప్రాంత దగ్గరలో మధ్యధరా సముద్రంలో ఓ భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఆఫ్రికా నుండి యూరప్ వెళ్తున్న అక్రమ వలసదారుల పడవ ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోయింది. కరోనా నేపథ్యంలో ఆఫ్రికాలో భారీగా కరువు తాండవించటం మాత్రమే కాక అక్కడ పేదరికం భారీగా పెరిగిపోవడం మరియు అంతర్యుద్ధం సంభవించడంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు మెరుగైన జీవితం కోసం మధ్యధరా సముద్రం ద్వారా యూరప్ లోకి అక్రమంగా చోరబడుతున్నారు.

పేదరికం, అంతరయుద్దం భరించలేక ఆఫ్రికా నుంచి చాలా మంది మెరుగైన జీవితం కోసం.. మద్యధరా సముద్రం గుండా యూరప్ లోకి అక్రమంగా చొరబడుతున్నారు. ఇందుకోసం రబ్బరు బొట్లను ఉపయోగిస్తారు. వీటిలో పరిమితికి మించి వాలసదారులను ఎక్కిస్తారు. అలా 130 మందితో బయలుదేరిన ఓ బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 130 మంది మృతి చెందారు. అయితే ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. రక్షించిన వారిలో పిల్లలు మరియు మహిళలు ఉన్నారు.ఏకంగా 130 మంది మరణించటంతో ఈ వార్త అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది.