Begin typing your search above and press return to search.

భారీ భూకంపం.. 250మందికి పైగా బలి!

By:  Tupaki Desk   |   22 Jun 2022 6:38 AM GMT
భారీ భూకంపం.. 250మందికి పైగా బలి!
X
పెను భూకంపం అప్ఘనిస్తాన్ ను చిగురుటాకులా వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా రికార్డ్ అయ్యింది. ఈ ఘటనలో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. 250 మందికి పైగా మృతిచెందినట్టు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే తాలిబన్ ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల తొలగింపు పనులు ముమ్మరం చేసింది. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

అప్ఘనిస్తాన్ ఆగ్నేయ దిశలో ఉన్న పక్టికా ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకొని ప్రాంతం ఉంటుంది ప్రాంతం. ఈ ప్రావిన్స్ రాజధాని ఖోస్ట్ నగరానికి 44 కి.మీల దూరంలో ఉన్న గయాన్ జిల్లాను ఈ భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ మేరకు అమెరికా జియాలాజికల్ సర్వే భూకంప కేంద్రాన్ని గుర్తించింది. ఉపరితలం నుంచి సుమారు 51 కి.మీల లోతున భూపలకాల కదలికల వల్ల ఈ భూకంపం సంభవించింది.

ఈ ఘటనలో 100కు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల మధ్య చిక్కుకొని ఇప్పటివరకూ 250 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలిస్తున్నామని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.

గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూప్రకంపనలు 500 చదరపు కిలోమీటర్ల వరకూ కనిపించినట్టు సమాచారం.

మట్టితో చేసిన నివాసాలు ఉన్న హిందూకుష్ రీజియన్ లోనే ఈ భూకంపం సంభవించింది. దీంతో అక్కడ ఇళ్లు అన్నీ కుప్పకూలిపోయాయి. అప్ఘనిస్తాన్ లో భూకంపాలు సంబవించడం సాధారణమే అయినా ఈ స్థాయిలో ప్రాణాలు తీసిన ఘటనలు చాలా తక్కువ. హిందుకుష్ మౌంటెయిన్ రీజియన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తాయని అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది.

తాలిబన్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. పెద్ద ఎత్తున హెలిక్యాప్టర్లను వినియోగించి క్షతగాత్రులను కాబుల్, కాందహార్ వంటి నగరాల్లోని ఆస్పత్రులకు తరలిస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకావం ఉండడంతో మరిన్ని చర్యలు చేపడుతోంది. గయాన్ జిల్లాలోని బర్మాలా, జిరుక్, నాకా పట్టణాలపై భూకంపం తీవ్రత పెద్ద ఎత్తున పడిందని మృతుల సంక్య భారీగా ఉన్నట్లు సమాచారం.