Begin typing your search above and press return to search.
అంగారకుడిపై ఏముంది? అగ్రదేశాలు ఎందుకు కన్నేశాయి?
By: Tupaki Desk | 20 Feb 2021 11:30 PM GMTఅంగారకుడిపై జీవరాశి ఉండే చాన్స్ ఉందని.. అక్కడ నీటి ఉందని.. గడ్డ కట్టిన స్థితిలో నీరు ఉందని గతంలో అనేక వార్తలు వచ్చేవి. నిజానికి అంగారక గ్రహం భూమికంటే ఎన్నోరెట్లు పెద్దది. దానిమీద ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు సాగలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి చైనా , అమెరికా యూఏఈ అంగారకుడిపై దృష్టి కేంద్రికరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చైనా, యూఏఈలకు చెందిన వ్యోమనౌకలు అంగారకుడిపై అడుగుపెట్టాయి. తాజాగా అమెరికాకు చెందిన నాసా మార్స్ రోవర్ కూడా అంగారకుడిపై ల్యాండ్ అయింది. అయితే అగ్రదేశాలు చేస్తున్న ఈ ప్రయోగాలు వెనక ఉన్న సీక్రెట్ ఏమిటని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. చాలా తక్కువ వ్యవధిలో మూడు దేశాలు అంగారకుడిపై భారీ ప్రయోగాలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.
గతేదాడి నెలల గ్యాప్‌లో అంగారక గ్రహంపైకి మూడు స్పేస్‌క్రాఫ్ట్‌లు ప్రయాణం ప్రారంభించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అల్ అమల్, చైనా తియాన్వే 1 అనే అంతరిక్ష నౌకలతో పాటు.. ఇప్పుడు మార్స్ మీద ల్యాండ్ అయిన నాసా రోవర్ కూడా కొద్ది నెలల వ్యవధిలోనే ప్రయోగించారు.ప్రతీ రెండేళ్లకు ఒకసారి భూమి, అంగారకుడు దగ్గర కక్ష్యల్లో ప్రయాణిస్తాయి. 2020లో ఈ రెండు గ్రహాలు దగ్గరకొచ్చాయి. మళ్లీ 2022లోనే సమీపించేది! దీంతో అంగారకుడి మీదకు గతేదాడి వరుస ప్రయోగాలు నిర్వహించారు. అయితే ఈ మూడు వ్యోమనౌకలు వేర్వేరు అంశాలపై ప్రయోగాలు చేయనున్నట్టు సమాచారం.
అంగారకుడిపై నీటి జాడలు ఉన్నట్టు గతంలో రోవర్స్ పంపిన కొన్ని చాయా చిత్రాల ఆధారంగా గుర్తించారు. అయితే ఇప్పుడు ఆ నీరు ఏమైపోయింది. అందుకు గల కారణాలు ఏమిటి? తదితర కారణాలను ఇప్పుడు తెలసుకోనున్నారు.
యూఏఈ క్రాఫ్ట్ అల్ అమన్ అంగారకుడిపై రెండేళ్లు ఉంటుంది. భూమి కక్ష్యలో ఉన్న వాతావరణ ఉపగ్రహాల్లా అరుణగ్రహంపై వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. చైనా తియాన్వే 1 వదిలిపెట్టిన రోవర్.. మట్టి నమూనాలను విశ్లేషిస్తుంది. గ్రహ ఉపరితల చిత్రాలను తీసి పంపిస్తుంది. నాసా రోవర్ క్రేటర్ మాత్రం అక్కడి సరస్సులోకి వెళ్లి జీవజాలానికి సంబంధించిన ఉనికిని కూడా గుర్తించనున్నది.