Begin typing your search above and press return to search.
‘‘మేకిన్ ఇండియా’’ వేదిక కాలి బూడిదైంది
By: Tupaki Desk | 15 Feb 2016 4:11 AM GMTవందలాది మంది విదేశీ అతిధులు.. వేలాదిగా స్వదేశీ ప్రముఖులు హాజరయ్యే ‘మేకిన్ ఇండియా’ వేదిక కాలి బూడిదైంది. విదేశీ పెట్టుబడీదారుల్ని ఆకర్షించేందుకు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మేకిన్ ఇండియా వారోత్సవాల కార్యక్రమం భారీగా శనివారం మొదలైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. పలు దేశాధినేతలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇదిలా ఉండగా.. ఆదివారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమం జరుగుతున్న వేళ.. ఒక్కసారిగా వేదిక దగ్గర పెద్ద ఎత్తున మంటలు చోటు చేసుకోవటంతో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా షాక్ తిన్న పరిస్థితి. వెంటనే స్పందించిన విపత్తు నివారణ దళం.. ఉరుకులు పరుగులతో అరగంట వ్యవధిలో మంటల్ని ఆర్పేసినప్పటికీ.. వేదిక మొత్తం కాలి బూడిదైన దుస్థితి.
ముంబయిలోని గిర్ గామ్ చౌపట్టీ సీఫ్రంట్ వద్ద నిర్వహిస్తున్న మేకిన్ ఇండియా కార్యక్రమ వేదిక ఈ తీరులో దగ్థం కావటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఆదివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమానికి సినీరంగ ప్రముఖులు అమితాబ్ బచ్చన్.. అమీర్ ఖాన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. మహారాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటల్ని ఆర్పేసేందుకు 14 ఫైరింజన్లు.. 10వాటర్ ట్యాంకర్లతో మంటల్ని ఆర్పేశారు. ప్రాణ నష్టం జరగనప్పటికీ.. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో కీలకమైన వేదిక ప్రాంగణం ఇలా తగలబడిపోవటం సంచలనంగా మారింది.