Begin typing your search above and press return to search.
గుడాల గుడారాన్ని పోలీసులు పసిగట్టారు
By: Tupaki Desk | 27 Oct 2015 9:56 AM GMTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్య కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. భర్తతో తగాదాతో పుట్టింటికి వచ్చిన కృపామణి చేత.. ఆమె తల్లి.. సోదరుడు కలిసి వ్యభిచారం చేయించేందుకు ఒత్తిడి చేయటం.. స్థానికంగా రాజకీయ నేతలతో పలుకుబడి ఉన్న గుడాల సాయినివాస్ అనే వ్యక్తి ఆమెను శారీరకంగా చిత్రహింసలు పెట్టటం.. ఆపై ఆమె తప్పించుకొని భర్త వద్దకు చేరటం తెలిసిందే.
ఆ తర్వాత కూడా గుడాల సాయినివాస్ తన కోర్కె తీర్చాలంటూ ఒత్తిడి చేయటంతో.. ఆ బెదిరింపులు తట్టుకోలేక వీడియో సూసైడ్ నోట్ ఒకటి సిద్ధం చేసి.. అనంతరం ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన కృపామణి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ కావటమే కాదు.. నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలన్న ఆదేశాల నేపథ్యంలో పోలీసులు తమ విచారణను ముమ్మరం చేశారు.
ప్రస్తుతం గుడాల సాయినివాస్ కుటుంబ సభ్యుల్ని విచారించిన పోలీసులు.. అతడికి చెందిన రెండు కార్లు.. బైకును స్వాధీనం చేసుకున్నారు. అతగాడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుడాల విశాఖపట్నంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు ఆరు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలింపును మరింత వేగవంతం చేశారు.
మరోవైపు.. కృపామణి తల్లికి సంబంధించి ఒక కొత్తకోణాన్ని పోలీసులు గర్తించారు. కృపామణి తల్లి పెన్ డ్రైవ్ లో వందలాది యువతుల నగ్నచిత్రాలు ఉండటంపై పోలీసులు విస్మయానికి గురి అవుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కృపామణి తల్లి.. సోదరుడితో సహా కీలక నిందితుల్లో ఎవరు దొరికినా ఈ కేసుకు సంబంధించిన చాలా విషయాల్లో స్పష్టత వస్తుందని చెబుతున్నారు.