Begin typing your search above and press return to search.

51 దేశాల్లోని 22 వేల మంది రాక్షసుల లిస్ట్ కావాలా?

By:  Tupaki Desk   |   10 March 2016 7:23 AM GMT
51 దేశాల్లోని 22 వేల మంది రాక్షసుల లిస్ట్ కావాలా?
X
తీవ్రవాదుల కోసం దేశాల వారీగా పెద్దపెద్ద సీక్రెట్ సర్వీసుల్ని పెట్టుకొని.. వందల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తుంటారు. వారి సమాచారం కోసం.. ఉగ్రవాద జాడల కోసం వారు పడే ప్రయాస అంతాఇంతా కాదు. అయితే.. అలాంటి ప్రయత్నం ఏమీ లేకుండా 51 దేశాలకు చెందిన 22 వేల మంది ఉగ్రవాదుల వివరాలు తెలిస్తే? అదో భారీ సంచలనం కావటం ఖాయం.

సరిగ్గా ఇప్పుడు అలాంటి సంచలనమే చోటు చేసుకుంది. బ్రిటన్ కు చెందిన స్కై న్యూస్ మీడియా సంస్థ సంచలన కథనానికి తెర తీసింది. అమెరికా.. బ్రిటన్.. యూరప్.. ఉత్తర ఆఫ్రికా.. కెనడా దేశాలకు చెందిన పలువురు ఉగ్రవాదానికి ఆకర్షితులై ఐఎస్ లో చేరిన వారి పేర్లు.. కుటుంబ సభ్యులు.. వారి ఇంటి అడ్రస్ లు.. ఫోన్ నెంబర్లు కూడా ఉండటం గమనార్హం.

ఐఎస్ ఉగ్రవాదులకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని సదరు మీడియా సంస్థ విడుదల చేయటం చూసినప్పుడు.. టెర్రరిస్టులకు సంబంధించి బంగారు నిధి బయటకు వచ్చినట్లేనని చెప్పొచ్చు. ఇంత పెద్ద వ్యవస్థలున్న దేశాలు చేయలేని పనిని ఒక మీడియా సంస్థ అలవోకగా చేయటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.