Begin typing your search above and press return to search.
ఉత్తరాంధ్రాలో భారీ ఉద్యమం...బీజేపీ నయా స్ట్రాటజీ...?
By: Tupaki Desk | 9 Feb 2022 5:30 AM GMTబీజేపీ ఏపీలో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా ప్రాంతాల వారీగా సభలను సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది. కోస్తా ప్రాంతానికి సంబంధించి ఈ మధ్యనే విజయవాడలో ప్రజాగ్రహ సభను నిర్వహించి సూపర్ సక్సెస్ అయింది. ఇక ఇటీవల రాయలసీమలో కూడా అయిదు రోజుల పాటు బీజేపీ నేతలు టూర్లు వేశారు. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను జనాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని తమ అజెండా చేసుకుని కర్నూల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించి వైసీపీ సర్కార్ ని ఎండగట్టారు.
ఈ సభలకు కేంద్రం నుంచి బీజేపీ ప్రముఖ నాయకులు వచ్చారు. ఇపుడు చూస్తే ఉత్తరాంధ్రా మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రాలో అయిదు రోజుల పాటు ప్రతీ నియోజకవర్గంలోనూ నేతలంతా తిరిగి ఎక్కడికక్కడ స్థానిక సమస్యల మీద పోరాటం చేస్తారు. ఆ తరువాత విశాఖలో భారీ సభను నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది అంటున్నారు.
ఇక ఉత్తరాంధ్రా జిల్లా తీరు చూస్తే బాగా వెనకబడి ఉన్నాయి. అందులో రెండవ మాట లేదు, విశాఖ సిటీ తప్ప విశాఖ రూరల్ జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం లలో అభివృద్ధి అన్నది కానరావడంలేదు. అంతదాకా ఎందుకు కనీసం తాగు సాగు నీటికి కూడా కటకటలాడుతున్న పరిస్థితి ఈ జిల్లాలలో ఉంది.
ఈ క్రమంలో బీజేపీ ఉత్తరాంధ్రాలో సాగు నీటి ప్రాజెక్టులను పరిపూర్తి చేయాలంటూ ఉద్యమించాలని చూస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు, నీటిపారుదల పెండింగ్ ప్రాజెక్టులను, వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్న్నదే బీజేపీ ప్రధాన ఆరోపణ. వీటి కారణంగా లక్షలాది ఎకరాల్లో సరైన పంటలు పండించుకునే అవకాశాలు కోల్పోయిన ఆ ప్రాంత రైతులు, ఇతర రాష్ట్రాలు,ప్రాంతాలకు, వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా వలసలుపోతున్నారు. దాంతో ఉత్తరాంధ్రా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది.
ఉత్తరాంధ్రా జిల్లాల్లో ప్రతీ నియోజకవర్గానికి అయిదు కోట్ల వంతున మొత్తం మూడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే చాలు సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి కావడమే కాదు, అయిదు లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని బీజేపీ నేతలు అంటున్నారు. నాడు తెలుగుదేశం అయినా ఇపుడు వైసీపీ అయినా సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో పైసా కూడా ఖర్చు చేయకపోవడం వల్ల ఉత్తరాంధ్రా దారుణంగా వెనకబడిందని బీజేపీ చెబుతోంది. ఈ క్రమంలో బీజేపీ రంగంలోకి దిగుతోంది.
ఉత్తరాంధ్రా ఉద్యమం పేరిట త్వరలో బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు నాయకత్వంలో సమరభేరీనే మోగిస్తారు అంటున్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయమని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళనను చేపడతారు. దీని ద్వారా బీజేపీ రాజకీయంగా కూడా బలపడాలని చూస్తోంది. బీజేపీకి విశాఖ సిటీలో బాగా బలం ఉంది. ఇక ఉత్తరాంధ్రా జిల్లాల్లో కూడా దాన్ని విస్తరించేలా చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో తన సత్తా చాటాలన్న అజెండా కూడా ఉంది. మొత్తానికి బీజపీ ఉత్తరాంధ్రా వైపు చూడడం అంటే రాజకీయంగా ఒక కొత్త ఎత్తుగడగానే అంతా భావిస్తున్నారు.