Begin typing your search above and press return to search.
ఒమైక్రాన్ పేరు వెనుక భారీ ప్లానింగ్? అసలేం జరిగింది?
By: Tupaki Desk | 28 Nov 2021 10:30 AM GMTనిన్నటి వరకు కరోనా ఆందోళన పెద్దగా లేని వారు సైతం ఇప్పుడు ఉలిక్కిపడేలా చేస్తోంది. కొత్త వేరియంట్ ఒకటి దక్షిణాఫ్రియాలో మొదలు కావటమే కాదు.. ఇప్పుడా దేశంలోని అన్ని ప్రావిన్స్ (మనకు రాష్ట్రాల మాదిరి) లోనూ ఈ కొత్త వేరియంట్ బారిన పడిన రోగుల్ని గుర్తిస్తున్నారు. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వేరియంట్ మీద ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కొత్త వేరియంట్ కు ''ఒమైక్రాన్'' పేరును డిసైడ్ చేయటం తెలిసిందే.
ఏదైనా కొత్త వేరియంట్ వచ్చి.. దాని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పేరు పెట్టటం ద్వారా.. ప్రపంచ ప్రజలకు ఇట్టే అవగాహన కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్లు పెడుతుంటుంది. ప్రోటోకాల్ ప్రకారం.. ఇలా పెట్టే పేర్లకు ఒక లెక్క ఉంటుంది. మన తెలుగు వర్ణమాలలో 'అ' అక్షరంలో మొదలై 'ఱ' వరకు అక్షరాలు ఉన్నట్లే.. గ్రీకు వర్ణమాలలోనూ అల్ఫా నుంచి ఒమేగా వరకు వరుసగా 24 అక్షరాలు ఉంటాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ కు సంబంధించి 12 వేరియంట్లను గుర్తించారు.
తాజాగా వెల్లడైన వేరియంట్ పదమూడోది. లెక్క ప్రకారం చూస్తే.. గ్రీకు వర్ణమాలలో 13వ అక్షరం 'ను' కానీ ఆ అక్షరాన్ని దాని పక్కనే ఉన్న 14వ అక్షరం 'షి'లను వదిలేసి 15వ అక్షరమైన 'ఒ' అక్షరంలో పేరు పెట్టటం ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకని.. 13, 14 అక్షరాలతో కూడిన పేర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్ట లేదన్న దానిపై ఆసక్తికరమైన వాదన విపనిపిస్తోంది.
ఒకవేళ తాజా వేరియంట్ కు 'ను' అక్షరంతో పేరు పెడితే.. దాని తర్వాత వేరియంట్ కు 'షి' అక్షరంలో పేరు పెట్టాలి. ఆ అక్షరం చైనా అధ్యక్షుడు 'షి జిన్ పింగ్'ను గుర్తుకు తెచ్చేలా ఉండటం ఖాయం. అదే జరిగితే.. చైనా అధ్యక్షుల వారికి ఇబ్బందిగా మారొచ్చు. ఇప్పటికే కరోనా పాపం మొత్తం చైనాదే అయినా.. దానికి మూల్యం మాత్రం యావత్ ప్రపంచం చెల్లిస్తోంది. ఈ విషయంలోనే ప్రపంచ దేశాలు ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే కరోనాకు తమకు సంబంధం లేదన్నట్లుగా ఉంటున్న చైనా.. వేరియంట్ కు చైనా అధ్యక్షుల వారి పేరులోని మొదటి అక్షరంలో పెడితే.. డ్రాగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా? అలా అని పదమూడో అక్షరం వాడేసి.. పద్నాలుగో అక్షరం వాడకుంటే రచ్చ అవుతుంది.
అందుకే.. అలాంటి ఇబ్బంది రాకుండా పదమూడు.. పద్నాలుగో అక్షరాలను పూర్తిగా ఎత్తేస్తే సరి. అందుకే 13, 14 అక్షరాల్ని వదిలేసి.. తర్వాత వచ్చిన అక్షరంతో 'ఒమైక్రాన్' పేరును పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఈ వాదన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మరి.. ఈ వాదనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని కవరింగ్ ఇస్తుందో? అన్నది ప్రశ్నగా మారింది.