Begin typing your search above and press return to search.
విశాఖ టూర్ లో పవన్ పై దాడికి భారీ ప్లానింగ్.. షాకింగ్ గా ఆ నేత వ్యాఖ్యలు
By: Tupaki Desk | 31 Oct 2022 4:11 AM GMTజనసేనాని పవన్ కల్యాణ్ 'జనవాణి' పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టటం.. దానికి కార్యస్థలంగా విశాఖపట్నాన్ని ఎంచుకోవటం తెలిసిందే. విశాఖ ఎయిర్ పోర్టు నుంచే పవన్ కల్యాణ్ కు సవాళ్లు ఎదురు కావటం.. హైడ్రామా అనంతరం విశాఖలోని నొవాటెల్ హోటల్ నుంచి ఎయిర్ పోర్టుకు వచ్చి.. మంగళగిరికి తిరిగి వచ్చేయటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో జనసేనకు చెందిన పలువురి మీద కేసులు పెట్టటం.. జైలుకు పంపటం లాంటివి చోటు చేసుకున్నాయి. అయితే.. జనవాణి కార్యక్రమానికి విశాఖకు పవన్ హాజరయ్యేందుకు వచ్చే పవన్ మీద దాడి చేసేందుకు భారీ ప్లానింగ్ జరిగిందన్న షాకింగ్ అంశాన్ని తాజాగా రివీల్ చేశారు నాదెండ్ల మనోహర్.
విలేకరులతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ సంచలన అంశాల్ని వెల్లడించారు. పవన్ మీద దాడి చేసేందుకు విశాఖలోని ఒక ఇంట్లో పక్కా ప్లానింగ్ జరిగిందన్నారు. 'విశాఖలో పవన్ పై దాడి చేయాలని.. తద్వారా అలజడిని క్రియేట్ చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ర్యాలీకి ముందురోజు రాత్రి విశాఖపట్నంలోని ఒక ముఖ్య వ్యక్తి ఇంట్లో ఇందుకు వ్యూహ రచన జరిగింది. ప్రభుత్వ కుట్రను ఎండగట్టటానికి న్యాయపోరాటం చేస్తాం' అని పేర్కొన్నారు.
ముందస్తు వ్యూహంలో భాగంగానే పవన్ పర్యటించే మార్గంలో వీధి దీపాలు ఆర్పేశారని.. ఒక ఐపీఎస్ అధికారి పవన్ వాహనంపై నిలబడి..కారు ఆపేయాలని.. కార్యక్రమాన్ని ముగించాలని ఒత్తిడి చేశారన్నారు. 'తమ చేతలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అలా చేస్తే..
పవన్ తో పాటు.. ఆయన పక్కనున్న కార్యకర్తల్ని ఆవేశపర్చాలన్నది వారి వ్యూహం. అదే అదునుగా ర్యాలీని అనుసరిస్తున్న కిరాయి మూకలతో దాడి చేయించాలని పన్నాగం వేశారు. పవన్ సంయమనంతో వారి వ్యూహం ఫలించలేదు' అని నాదెండ్ల పేర్కొన్నారు.
పవన్ పై దాడి చేయాలని.. ఉత్తరాంధ్రలో భయభ్రాంతుల్ని క్రియేట్ చేయాలని.. జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేయించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిననట్లుగా పేర్కొన్నారు. నాదెండ్ల వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ మీద దాడి చేసేందుకు ఆయన పర్యటనకు ముందు రోజు రాత్రి విశాఖలోని సమావేశం జరిగినట్లు చెప్పిన ఆయన.. 'ఒక ప్రముఖుడి ఇంట్లో' అంటూ చెప్పటం తెలిసిందే. దీంతో.. ఆ ప్రముఖుడు ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. దీనికి సంబంధించిన వివరాల్ని నాదెండ్ల ఎప్పుడు బయటపెడతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.