Begin typing your search above and press return to search.

భారీగా తగ్గిన బైడెన్ గ్రాఫ్ .. కారణం అదే

By:  Tupaki Desk   |   3 Sep 2021 11:30 AM GMT
భారీగా తగ్గిన బైడెన్ గ్రాఫ్ .. కారణం అదే
X
అఫ్గనిస్థాన్ దేశం నుండి అమెరికా బలగాల ఉపసంహరణ విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘానిస్తాన్ నుండి తాలిబన్లు మెరుపు వేగంతో అఫ్గన్‌ ను ఆక్రమించుకోవడంతో విదేశాలతోపాటు స్వదేశంలోనూ బైడెన్‌ ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ పాపులారిటీ అమాంతం పడిపోయినట్టు ఓ సర్వే పేర్కొంది.

జో విదేశాంగ విధానంతో మెజార్టీ అమెరికన్లు తీవ్రంగా విబేధించినట్టు ఎన్‌ పీఆర్, పీబీఎస్ న్యూస్‌ హవర్‌ తో కలిసి నిర్వహించిన న్యూ మారిస్ట్ నేషనల్ పోల్‌ లో వెల్లడయ్యింది. అంతేకాదు, అఫ్గన్‌లో అమెరికా విధానం కూడా విఫలమయ్యిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. బైడెన్ పాపులారిటీ 43 శాతం కనిష్టానికి పడిపోగా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతగా తగ్గిపోవడం ఇదే తొలిసారి. బైడెన్ విదేశాంగ విధానాన్ని 43 శాతం మంది సమర్ధించగా.. 56 శాతం మంది వ్యతిరేకించారు.

అఫ్గనిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణను 61 శాతం మంది వ్యతిరేకించడం గమనార్హం. అంతేకాదు, అఫ్గన్‌ లో అమెరికా విధానం పూర్తిగా విఫలమయ్యిందని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలా అభిప్రాయపడిన 71 శాతం మంది అమెరికన్లలో 73 శాతం మంది రిపబ్లికన్లు 66 శాతం మంది డెమొక్రాట్లు కూడా ఉన్నారు. ఇది బైడెన్ సొంత పార్టీ సహచరులల్లోనే ప్రధాన అసమ్మతిని సూచిస్తుంది. ఈ విభాగంలో 75 శాతం స్వతంత్ర రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అయితే, అధిక శాతం మంది అమెరికన్లు లేదా 61 శాతం మంది యూఎస్ ప్రమేయం లేకుండా అఫ్గన్లు తన భవిష్యత్తును నిర్ణయించుకోవాలని, 29 శాతం మంది యుద్ధంలో పాల్గొనడం అమెరికా విధి అని నమ్ముతున్నారు.